ఉపాసన ట్వీట్..! స్పందించిన కేటీఆర్..! డిసెంబర్ 11 వరకు వెయిట్ చేయాలంట.! ఎందుకో తెలుసా.?  

Ktr\'s Sense Of Humour On Upasana\'s Tweet-

అపోలో హాస్పటల్స్ గ్రూప్ కి వైస్ చైర్మన్ గా బాద్యతలు నిర్వహిస్తున్న ఉపాసన వేలమందికి బాస్ .మెగా కోడలిగా అందరి మన్ననలు పొందుతుంది...

ఉపాసన ట్వీట్..! స్పందించిన కేటీఆర్..! డిసెంబర్ 11 వరకు వెయిట్ చేయాలంట.! ఎందుకో తెలుసా.?-KTR's Sense Of Humour On Upasana's Tweet

మొదట్లో చరణ్ కి సరిజోడిగా లేదనే నెగటివ్ టాక్ ఉన్నప్పటికీ తర్వాత తన మంచి మనసుతో మెగా కుటుంబ అభిమానాన్నే కాదు అందరి ఆదరాభిమానాల్ని పొందింది. అపోలో లైఫ్ కి ఎండీ గా అపోలో ఫౌండేషన్ కి వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు మోస్తున్నప్పటికీ భర్త రామ్ చరణ్ పనులను దగ్గరుండి చూసుకుంటోంది. ఎప్పటికప్పుడు ట్విట్టర్లో అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

ట్విట్టర్లో ఆమె పోస్టు చేసే విషయాలపట్ల మెగా అభిమాానులు ఆసక్తి కనపరుస్తుంటారు.

అంధ బాలికల హాస్టల్‌కు వార్డెన్‌గా పని చేస్తున్న శైలజా రాణి వీడియోను ఉపాసన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. స్కూల్ కోసం గవర్నమెంట్ బిల్డింగ్ సాంక్షన్ చేసింది.

దీనిపై చాలా సంతోషంగా ఉన్నాం. హాస్టల్ కోసం కూడా మంచి భవనం సాంక్షన్ చేస్తే మరింత సంతోషిస్తాని శైలజా రాణి ఆ వీడియో ద్వారా కోరారు...

“ప్రియమైన తెలంగాణ ప్రభుత్వం. మీరు గొప్పగా పని చేస్తున్నారు.

కానీ మీ నుంచి మరింత సహాయం అవసరం. ఈ బాలికల కోసం సహాయం చేయండి. నా వంతు సేవ నేను చేస్తున్నాను...

దయచేసి వీరికి ఒక హాస్టల్ భవనం సాంక్షన్ చేయండి” అంటూ ఉపాసన ట్వీట్ చేసారు.

కేటీఆర్ స్పందిస్తూ…. “స్కూలు భవనం మంజూరైనందుకు సంతోషంగా ఉంది. త్వరలోనే హాస్టల్ భవనం కూడా సాంక్షన్ చేస్తాం. అయితే మీరు డిసెంబర్ 11న కొత్త గవర్నమెంట్ ఏర్పడే వరకు ఆగాలి అని కోరారు. ” ఈ వీడియో కోసం క్లిక్ చేయండి.