కేటీఆర్‌ బాధ్యతలు కవితకు వెళ్లనున్నాయా?  

Ktr Trs Party Working President This Responsibilities Transfer To Kavitha - Telugu Kavitha, Kcr Cabinet Ministers, , Nizamabadh Mp Farmmer Mp Kavitha, Telangana

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రి వర్గం విస్తరణ తర్వాత రాష్ట్రంలోని రాజకీయం వేడెక్కింది.మంత్రి పదవులు దక్కని వారు అసహనం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.

Ktr Trs Party Working President This Responsibilities Transfer To Kavitha

ఇదే సమయంలో పార్టీ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు మంత్రి పదవి ఎందుకు అంటూ ప్రశ్నించారు.పార్టీని, ప్రభుత్వంను నడపడం ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ ప్రశ్నకు కేసీఆర్‌ వద్ద మొదటే సమాధానం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ ఉన్న విషయం తెల్సిందే.

ఆయన్ను తాజాగా మంత్రి వర్గంలోకి తీసుకున్న కారణంగా ఆ బాధ్యతలను కేసీఆర్‌ తన కూతురు కవితకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్‌ నుండి పోటీ చేసి ఓడిపోయిన కవిత గత కొన్నాళ్లుగా ఎక్కువగా కనిపించకుండా ఉంది.

ఆమెను మళ్లీ పార్టీ క్రియాశీలకంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌గా చేయడం వల్ల ఆమెకు రాజకీయంగా ప్రాముఖ్యత ఇచ్చినట్లవుతుందని అంతా భావిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ktr Trs Party Working President This Responsibilities Transfer To Kavitha Related Telugu News,Photos/Pics,Images..

footer-test