కేటీఆర్ ముందు చూపు తెలంగాణకు వరం కాబోతోందా ?

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందుచూపుతో వ్యవహరిస్తూ ఉంటారు.ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటూ, పార్టీకి ప్రభుత్వానికి మైలేజ్ తీసుకువచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు.

 Telangana, Trs Party, Working President, Ktr, Corona Virus, China, Japan, Korea, Industries-TeluguStop.com

అలాగే పార్టీలో నాయకుల మధ్య గ్రూపు తగాదాలను ,అసంతృప్తులను బుజ్జగిస్తూ పార్టీకి చేటు లేకుండా చూసుకుంటూ ఉంటారు.ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా, ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలను, మౌలిక సదుపాయాలను కల్పిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

కరోనా ఎఫెక్ట్ తెలంగాణలోనే కాకుండా ప్రపంచమంతా ఉంది.ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి.

 Telangana, TRS Party, Working President, KTR, Corona Virus, China, Japan, Korea, Industries-కేటీఆర్ ముందు చూపు తెలంగాణకు వరం కాబోతోందా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో అన్ని విషయాల్లోనూ మౌలికమైన మార్పులు రావడం తథ్యం గా కనిపిస్తోంది.

అసలు ఈ కరోనా వైరస్ ఈ స్థాయిలో ప్రబలడానికి కారణం చైనా అని ప్రపంచ దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి.

అమెరికా వంటి దేశాలు బహిరంగంగానే చైనా తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రపంచ తయారీ రంగానికి ప్రధాన కేంద్రంగా ఉన్న చైనా నుంచి అనేక సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.

జపాన్, కొరియా వంటి సంస్థలు చైనాలో ఉన్న తమ సంస్థలను అక్కడి నుంచి ఇండియాకు తరలించాలని చూస్తున్నాయి.దీంతో ఇప్పటి నుంచే కేటీఆర్ చైనా నుంచి తరలివచ్చే సంస్థలను తెలంగాణలో ఏర్పాటు చేసే విధంగా బ్లూ ప్రింట్ ను రెడీ చేసుకున్నారు.

ఈ మేరకు తెలంగాణ అధికారులకు దిశానిర్దేశం కేటీఆర్ చేశారు.

Telugu China, Corona, Japan, Korea, Telangana, Trs-Telugu Political News

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఇప్పుడు తమ పరిశ్రమలను ఇతర దేశాలకు తరలించే ఆలోచనలో ఉన్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పెట్టుబడి అవకాశాలు ఉన్న రంగంలో మరింత చురుగ్గా పని చేయాలని, విదేశాల నుంచి వచ్చే పరిశ్రమలోని ఆకర్షించేందుకు సిద్ధంగా ఉండాలని, మన దేశంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు తెలంగాణ అన్ని విధాలుగా సహాయసహకారాలు అందజేస్తోందనే విధంగా వారికి భరోసా కల్పించాలని కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఇప్పటికే కేటీఆర్ అమెరికాలో చదువుకుని విదేశీ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉండడంతో పెట్టుబడి ఆకర్షణ విషయంలో ఆయన ముందుగానే ఈ విధంగా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

ప్రస్తుతం చైనా ను ప్రపంచ దేశాలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో పెట్టుబడుల కేంద్రంగా భారత్ ఎదుగుతుందని, ముఖ్యంగా తెలంగాణ లో అన్ని పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని కేటీఆర్ భావిస్తున్నారు.

దానిలో భాగంగానే ముందస్తుగానే అప్రమత్తంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube