వేడుకలేమీ లేకుండా టీఆర్‌ఎస్‌ 20వ ఆవిర్భావ దినోత్సవం

ఈ కరోనా లాక్‌డౌన్‌ లేకుంటే నేడు టీఆర్‌ఎస్‌ శ్రేణులకు అత్యంత పెద్ద పండుగా.కేసీఆర్‌ పార్టీని ప్రారంభించి నేటికి 20 ఏళ్లు.

 Ktr Says No Celabrations For Trs Formation Day, Telangana, Kcr, Ktr, Telangana Formation Day, Trs Working President Ktr-TeluguStop.com

ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించే వారు.కాని ప్రస్తుత పరిస్థితుల్లో వేడుకలు కాదు కదా కనీసం చిన్న పాట మీటింగ్‌ కూడా నిర్వహించుకునే పరిస్థితులు లేవు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించుకోనవసరం లేదని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు.

 KTR Says No Celabrations For TRS Formation Day, Telangana, KCR, KTR, Telangana Formation Day, TRS Working President KTR-వేడుకలేమీ లేకుండా టీఆర్‌ఎస్‌ 20వ ఆవిర్భావ దినోత్సవం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ పార్టీ జెండా ఎగురవేయనున్నారు.

జిల్లాల్లో మండలాల్లో సామాజిక దూరం పాటిస్తూ కార్యకర్తలు ఈ సందర్బంగా ఆవిర్భావ దినోత్సవంను జరుపుకోవాలని సూచించారు. ఈ ఇరువై ఏళ్లలో పార్టీ సాధించిన విజయాలను మరియు రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలను గురించి మీడియా ముందు అధ్యక్షుడు కేసీఆర్‌ వెళ్లడి చేయబోతున్నారు.

ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్‌ఎస్‌ ఇప్పుడు రాజకీయ పార్టీగా ఆవిర్భవించి రెండు దఫాలుగా ప్రభుత్వాన్ని చేపట్టింది.తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన టీఆర్‌ఎస్‌కు రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube