పెద్ద టార్గెట్టే పెట్టుకున్న కేటీఆర్ !  

KTR Targets Gretaer Elections, Hyderabad, Muslim Votes, Greater Elections, Telangana, CM KCR - Telugu Cm Kcr, Greater Elections, Hyderabad, Ktr Targets Gretaer Elections, Muslim Votes, Telangana

తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ ఎంత శక్తివంతుడు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానూ, మంత్రిగానూ సమర్ధవంతంగా ఆయన తన బాధ్యతలు నిర్వర్తిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారు.

TeluguStop.com - Ktr Targets Greater Elections Telangana

ఆయన పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, ఆయన వ్యవహరిస్తున్న తీరు, నాయకత్వ లక్షణాలు ఇవన్నీ ఆయనకు ఆ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి.తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిగా, అటు ప్రజల్లోనూ గుర్తింపు సాధించారు.

సమకాలిన రాజకీయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, తాను అనుకున్న పని సాధించగల దిట్టగా కేటీఆర్ పేరు గడించారు.ప్రస్తుతం కేటీఆర్ దృష్టి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పైనే పెట్టారు.అక్కడ పార్టీకి తిరుగులేని మెజారిటీ సాధించి పెట్టి తన ప్రతిభను మరోసారి చాటుకోవాలని చూస్తున్నారు.
2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను, 99 డివిజన్లలో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థానాలను టిఆర్ఎస్ కు దక్కే విధంగా చేయాలనే టార్గెట్ ను కేటీఆర్ పెట్టుకున్నారు.ఆ టార్గెట్ తోనే ఎక్కడికక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ, నిధుల కేటాయింపులు వంటివి ప్రకటిస్తూ, కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నారు.

TeluguStop.com - పెద్ద టార్గెట్టే పెట్టుకున్న కేటీఆర్ -Political-Telugu Tollywood Photo Image

అప్పట్లో కెసిఆర్, కేటీఆర్ కు ఏ విధంగా అయితే గ్రేటర్ బాధ్యతలు అప్పగించారో ఇప్పుడు అదే విధంగా, అంతే స్థాయిలో విజయాన్ని సాధించాలనే టార్గెట్ ను కెసిఆర్ పెట్టారు.దీంతో అలుపెరగకుండా గ్రేటర్ ఎన్నికలపై కేటీఆర్ దృష్టిపెట్టారు.

క్షణం తీరికలేదు అన్నట్టుగా, ఎక్కువగా అభివృద్ధి సంక్షేమ పనులకు, శంకుస్థాపనలు చేస్తూ జనంలో తిరుగుతూ హడావుడి చేస్తున్నారు.అలాగే గ్రేటర్ పరిధిలో ఎక్కువగా ఉన్న ముస్లిం ఓట్లు ఉండడంతో, హోం మంత్రి మహమూద్ ఆలీతో కలిసి ముస్లిం ఓటు బ్యాంకు సాధించే విషయమై పదేపదే చర్చలు జరుపుతున్నారు.క్రైస్తవులను దగ్గర చేసుకునేందుకు పాస్టర్ల తో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.గ్రేటర్ ఎన్నికల్లో విపక్షాలకు తావు లేకుండా చేయాలనేది కేటీఆర్ టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు.

ఎప్పటికప్పుడు రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలను ఛేదిస్తూ, పై చేయి సాధిస్తూ వస్తున్నారు.ఇప్పుడు ఈ గ్రేటర్ బాధ్యలను ఎంత సమర్ధవంతంగా చూస్తారో చూడాలి.

#Muslim Votes #CM KCR #KTRTargets #Telangana #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ktr Targets Greater Elections Telangana Related Telugu News,Photos/Pics,Images..