జ‌గ‌న్‌కు క‌రెక్టు టైమ్‌లో కేటీఆర్ మ‌ద్ద‌తు.. వైసీపీ రియాక్ష‌న్ ఏంటో..?

Ktr Support To Jagan At The Correct Time What Is The Ycp Reaction

ప్రతి సారి ఏకాకిలా మారుతున్న ఏపీ సీఎం జగన్ కు కాస్త ఊరట లభించింది.ఏపీ టీడీపీ నాయకుడు పట్టాభి జగన్ ను బూతులు తిట్టడం సరి కాదని పక్క రాష్ర్ట మంత్రి కేటీఆర్ అన్నారు.

 Ktr Support To Jagan At The Correct Time What Is The Ycp Reaction-TeluguStop.com

అసలే టీఆర్ఎస్ కు వైసీపీకి కృష్ణా జలాల వివాదం నడుస్తున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామా రావు జగన్ కు సపోర్ట్ గా మాట్లాడడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు.జగన్ మొదటి నుంచి రాజకీయాల్లో ఒంటరితనమే అనుభవిస్తూ వస్తున్నారు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్ ఏ రాజకీయనాయకులతోనూ పెద్దగా కలిసింది లేదు.అందుకోసమేనేమో టీడీపీ ఆయన్ను టార్గెట్ చేస్తూ వస్తోంది.

 Ktr Support To Jagan At The Correct Time What Is The Ycp Reaction-జ‌గ‌న్‌కు క‌రెక్టు టైమ్‌లో కేటీఆర్ మ‌ద్ద‌తు.. వైసీపీ రియాక్ష‌న్ ఏంటో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ పట్టాభి విషయంలో మాత్రం జగన్ కు పెద్ద పాజిటివ్ ఎనర్జీ లభించినట్లయింది.ఈ మధ్య జగన్ తాడేపల్లి లోని క్యాంప్ ఆఫీస్ వదిలి బయటకు రావడం లేదు.

రాజకీయాల్లో ఓడిపోయిన వారు వారు ఇలా స్థాయిని మరిచి బూతులు మాట్లాడడం సరైంది కాదని ప్రజలకు దగ్గరయ్యేందుకు మరింత ప్రయత్నించాలని ఆయన టీడీపీకి హితవు పలికారు.ఆయన పరోక్షంగా జగన్ కు మద్దతు పలుకుతూ చేసిన ఈ కామెంట్స్ వైసీపీ శ్రేణులకు ఫుల్ కిక్ ఇచ్చాయి.

రాజకీయంగా అసహనం పెంచుకునే ఇలాంటి పనులు చేస్తున్నారు కావొచ్చు.అని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.

కేవలం ఏపీలోని విపక్షాలకు మాత్రమే కాకుండా తెలంగాణలోని విపక్షాలకు కూడా కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలనే తొందర ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.

వైసీపీని ఎలాగైనా సరే బ్లేమ్ చేసేందుకు చూస్తున్న టీడీపీకి కేటీఆర్ కౌంటర్లు ఇబ్బందికరంగా మారాయని పలువురు చర్చించుకుంటున్నారు.అంతే కాకుండా టీడీపీ విషయంలో టీఆర్ఎస్ ఏమనుకుంటుందో కూడా ఈ పదాలు తెలుపుతున్నాయని పలువురు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం కేటీఆర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిగ్గా మారాయి.

#Jagan #KTRJagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube