చిప్ప కూడు తినే....కేటిఆర్ షాకింగ్ కామెంట్స్   KTR Shocking Comments On Revanth Reddy     2018-01-13   19:04:23  IST  Bhanu C

తెలంగాణా సర్కారుపై ఎప్పటికప్పుడు నోరుపారేసుకుంటూ…చిందులుతొక్కే రెంత్ రెడ్డి కి తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటిఆర్..చురకలు అంటించారు..సంచలన కామెంట్స్ చేస్తూ రేవంత్ పై మాటల దాడి చేశారు…రేవంత్ ఇప్పటి వరకూ మాట్లాడిన, ఆరోపించిన విమర్శలు అన్నిటికి ఒక్క మాటలో సమాధానం చెప్పేశారు కేటిఆర్. ఇంతకీ కేటిఆర్ ఏమన్నారంటే…

విదేశీ పర్యటనకి వెళ్తున్న కేటిఆర్ ని మీడియా పలకరించింది..మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తూ..ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రస్తావన వచ్చింది..దాంతో కేటిఆర్ ని డైరెక్ట్ గా తిట్టకుండా ఇన్డైరెక్ట్ గా ఏకి పడేశారు..విపక్షాలకి పనీ పటాలేదు ఎప్పుడు కేసీఆర్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం పై పెట్టే శ్రద్ధ తమకోసం పెట్టుకుని ఉంటే ఎప్పుడు బాగుపడే వాళ్ళు అంటే ఫైర్ అయ్యారు..అంతేకాదు రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడం ప్రతిపక్షాలకి ఇష్టం లేదని అందుకే24గంటల కరెంటుపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంలోనే రేవంత్ పై సెటైర్ వేశారు కేటిఆర్..

“జైలులో చిప్పకూడ తిన్నవారు కూడా ఇపుడు నీతులు చెప్తున్నారని” సెటైర్లు వేశారు కేటీఆర్…అవినీతి గురించి కొంతమంది ప్రబుద్దులు మాట్లాడటం ఎంతో హస్యసస్పధంగా ఉందని అన్నారు..ఈ నెలలో పంచాయితీ రాజ్ చట్టంపై ప్రత్యేక సమావేశాలు ఉండొచ్చని సూచనప్రాయంగా చెప్పారు కేటీఆర్…కాంగ్రెస్ వాళ్ళు ప్రజలను, రైతలును కాల్చుకు తింటే మేము కరెంట్ ఇచ్చి అదుకుంటున్నామన్మునారు. మీకు దమ్ముంటే కరెంటు విషయంలో అవినీతి జరిగింది అని ఆధారాలు మీ దగ్గర ఉంటే బయట పెట్టండి కేసులు వేయండి..కోర్టులని ఆశ్రయించండి అంటూ సమాధానం చెప్పారు

చిప్ప కూడు తినే వాళ్ళు సైతం నీతులు చెప్తున్నారు అలాంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలా అని ప్రశ్నించారు….అసేంభ్లీలో మాట్లాడకుండా పారిపోతారు మల్ల తిరిగి బయట మాత్రం చర్చించాలని డిమాండ్ చేస్తారు ఎందకో అని ప్రశ్నించారు.పనిలో పనిగా ఏపీ రాష్ట్రంపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు..మరి కేటిఆర్ రేవంత్ పై వదిలిన చిప్పకూడు కామెంట్స్ కి రేవంత్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.