భైంసా హింస ఘటన పై కేటీఆర్‌ గరం గరం.. ?

తెలంగాణ నిర్మల్‌ జిల్లాలోని భైంసా పట్టణంలో నిన్న రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా, ఈ దాడిలో ప్రజలతో పాటుగా పోలిసు, మీడియా వ్యక్తులకు కూడా గాయాలు అయ్యాయన్న విషయం తెలిసిందే.ఈ అంశం పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‌తీవ్రంగా స్పందించారు.

 Ktr Seriouson On Bhainsa Violence-TeluguStop.com

ఈమేరకు భైంసాలో జరిగిన అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని, అల్లర్లకు కారణం అయిన వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ భైంసా అల్లర్ల పై గరం అయ్యారు.

 Ktr Seriouson On Bhainsa Violence-భైంసా హింస ఘటన పై కేటీఆర్‌ గరం గరం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చట్టవ్యతిరేక చర్యలను ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో సహించదని అల్లరి మూకలకు హెచ్చరించారు.ఇక భైంసా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తూ పుకార్ల‌ను న‌మ్మొద్ద‌ని, ద్వేష‌పూరిత ప్ర‌సంగాలు చేసే వారి ఉచ్చులో ప‌డొద్ద‌ని కేటీఆర్ వెల్లదించారు.

ఇకపోతే భైంసాలో హింసకు పాల్పడిన అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్‌ అలి, డీజీపీ మహేందర్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు

.

#Bhainsa #Telangana #KTR Seriouson

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు