అప్పుడు సున్నాలు... ఇప్పుడు కన్నాలు ! రేవంత్ పై కేటీఆర్ సెటైర్ 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి – టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మధ్య మరోసారి రాజకీయ వివాదం మొదలైంది.గత కొద్ది రోజులుగా మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు రేవంత్.

 Ktr Sensational Comments On Revanth Reddy, Revanth Reddy, Telangana, Kcr, Ktr, T-TeluguStop.com

ముఖ్యంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం లో కేటీఆర్ పాత్ర ఉందనే విషయంపై రేవంత్ పదే విమర్శలు చేస్తున్నారు.కాకపోతే ఎక్కడా కేటీఆర్ పేరును ప్రస్తావించకుండా విమర్శలు చేస్తుండడం,  ఈ డ్రగ్స్ మాఫియా లో కేటీఆర్ పాత్ర కూడా ఉంది అన్నట్లుగా విమర్శలు చేస్తూ ఉండడం వంటి వ్యవహారాలపై తాజాగా కేటీఆర్ స్పందించారు.

ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యవహారంపై స్పందించారు.
  తమపై చాలామంది చాలా విమర్శలు చేస్తున్నారని,  డ్రగ్స్ టెస్ట్ కు తాను సిద్ధమేనని ప్రకటించారు.

ఎవరో పిచ్చోడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి లేక ఇచ్చాడని తీవ్రంగా మండిపడ్డారు.తనకు డ్రగ్స్ కేసు కు ఎటువంటి సంబంధం లేదని, కావాలంటే తన బ్లడ్ శాంపిల్స్,  వెంట్రుకలు అవసరమైన శాంపిల్స్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.

అయితే నేనొక్కడినే కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ టెస్ట్ లు చేయించుకునేందుకు సిద్ధంగా ఉండాలి అంటూ కేటీఆర్ చాలెంజ్ విసిరారు.తన విషయంలో కానీ,  కేసీఆర్ విషయంలో కానీ ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, కేసులు పెడతామని హెచ్చరించారు.

సీఎం కేసీఆర్ పై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని,  అవసరమైతే రాజద్రోహం కేసులు కూడా పెడతామంటూ హెచ్చరించారు.
 

Telugu Revanth Reddy, Telangana, Tollywood Drugs, Trs-Telugu Political News

 ఒకప్పుడు సున్నాలు వేసిన వ్యక్తి ఈరోజు కర్నూలు వేస్తున్నాడని రేవంత్ పై కేటీఆర్ సెటైర్ వేశారు.అలాగే శశి థరూర్ ను రేవంత్ రెడ్డి గాడిద అనడం పైన కేటీఆర్ స్పందించారు.కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు గాడిదలు అయితే రేవంత్ రెడ్డి అడ్డ గాడిద అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube