ఈషా చేసిన ట్వీట్ కు కేటీఆర్ రియాక్షన్ ఏంటో తెలుసా.? అసలు ఏమైంది?       2018-06-25   02:53:24  IST  Bhanu C

మంత్రి కెటిఆర్ ట్విటర్లో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే.. అంతే యాక్టివ్ గా ఏదన్నా సమస్య ఉందన్నా వెంటనే స్పందిస్తారు.అంతేకాదు తనలోని హాస్యప్రియున్ని కూడా పరిచయం చేశారు. తాజాగా ఓ హీరోయిన్‌ చేసిన ట్వీట్‌కు ఆయన సమాధానమిచ్చారు.

ఈషా రెబ్బ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేస్తూ.. ‘భారత్‌లోని ఎన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్‌ను నిషేధించాయి. మన రాష్ట్రం చాలా విషయాల్లో నెం.1గా ఉంది. కానీ, మన రాష్ట్రాన్ని ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా ఎందుకు మార్చడం లేదు. మీరు దీని గురించి ఆలోచించండి’ అంటూ సలహా ఇచ్చారు. కేటీఆర్‌ వెంటనే స్పందిస్తూ.. ‘కేవలం చట్టాలు చేయడం వల్ల ప్లాస్టిక్‌ను నియంత్రించలేం. ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలు అధికారులు, తయారీదారులు, వినియోగదారులకు అర్థమైనప్పుడే నియంత్రించగలమని ప్రస్తుతం దీనిపై అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ’ బదులిచ్చారు.

‘ధన్యవాదాలు సర్‌. వెంటనే రిప్లై ఇచ్చినందుకు. నేను ఈ విషయంలో మీతో ఏకీభవించను. మీలాంటి సమర్థవంతుడైన యువ నాయకుడు ఉంటే ఏదైనా సాధించగలం. మీరు తలుచుకుంటే మన రాష్ట్రాన్ని ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రాల్లో నెం.1గా మార్చగలరు’ అంటూ ఈషా రెబ్బ ట్వీట్‌ చేశారు.