హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్ర‌చారానికి కేటీఆర్‌, క‌విత దూరం.. కార‌ణం ఇదేన‌ట‌

తెలంగాణలో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంత హాట్ టాపిక్‌గా ఉందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు.ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ గ‌ట్టి ప‌ట్టుమీద ఉన్నాయి.

 Ktr, Poetic Distance To Huzurabad By-election Campaign This Is The Reason, Ktr,-TeluguStop.com

ఇక మొన్న‌నే నోటిఫికేషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ విడుద‌ల చేసింది.దాదాపు సెకండ్ లాక్‌డౌన్ త‌ర్వాత మూడునెలల పాటుగా సాగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక హోరులో టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్టు జోరు సాగింది.

ఇక ఎట్ట‌కేల‌కు ఇప్పుడు నోటిఫికేష‌న్ కూడా రావ‌డంతో అన్ని పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే అత్యంత‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా సాగుతున్న ఈ ఉప ఎన్నిక‌కు మొద‌టి నుంచి కేటీయార్, కవిత దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే.

అప్పుడంటే ఇంకా నోటిఫికేష‌న్ రాలేదు కాబ‌ట్టి దూరంగా ఉన్నార‌ని అంతా అనుకుంటే పొర‌పాటే.ఎందుకంటే ఇప్పుడు కూడా వారిని దూరంగానే ఉంచుతున్న‌ట్టు తెలుస్తోంది.ఈ విష‌యంపై ఇప్ప‌టికే అటు టీఆర్ఎస్‌తో పాటు ప్ర‌తిప‌క్షాల్లో కూడా జోరుగా చర్చ సాగుతోంది.అయితే త‌న కొడుకు, బిడ్డ‌ను కేసీయార్ ఎందుకు దూరం పెట్టార‌నే దానికి కొన్ని కార‌ణాలు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Telugu Cm Kcr, Eetala Rajendar, Haresh Rao, Huzurabad, Kavitha, Tg-Telugu Politi

అందేంటంటే ఇప్ప‌టికే కేటీఆర్‌, క‌విత‌ల మీద అవినీతి ఆరోపణలు బాగానే వ‌స్తున్నాయి.ప‌దే ప‌దే ప్ర‌తిప‌క్షాలు వారి చాలా ర‌కాల ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.కాగా వీళ్లిద్దరినీ ప్రచారంలో దింపితే అది త‌మ పార్టీకి, అలాగే గెల్లు శ్రీనివాసయాదవ్ కు వ్య‌తిరేక‌త తెచ్చే ప్ర‌మాదం ఉంటుంద‌ని కేసీయార్ భావిస్తున్నారంట‌.కాబ‌ట్టే వారిద్ద‌రినీ దూరం పెట్టేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక గెలుపు బాధ్యతల‌ను మొత్తం హరీష్ రావు భుజాన మోపిన కేసీఆర్ ఒక‌వేళ ఓడిపోతే హ‌రీశ్‌రావు మీద ఆ ఎఫెక్ట్ వేసేయొచ్చ‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం న‌డుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube