కేటీఆర్ చెంతకు చేరిన ఎన్టీఆర్-మీరా చోప్రా వివాదం  

Ktr Ntr Meera Chopra - Telugu Ktr, Meera Chopra, Ntr, Tollywood News

టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై నటి మీరా చోప్రా చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి.ఇప్పటికే పలుమార్లు తారక్ ఫ్యాన్స్ గురించి మీరా చోప్రా ప్రస్థావించింది.

 Ktr Ntr Meera Chopra

ఎన్టీఆర్‌కు ఇలాంటి ఫ్యాన్స్ ఉన్నారంటే, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడో అర్థమవుతుందని మీరా చోప్రా వివాదాస్పదమైన కామెంట్స్ చేసింది.దీంతో టాలీవుడ్‌లో ఈ రచ్చ రోజురోజుకూ ముదురుతూనే ఉంది.

కాగా ఈ వ్యవహారం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.

కేటీఆర్ చెంతకు చేరిన ఎన్టీఆర్-మీరా చోప్రా వివాదం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తనను ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని, గ్యాంగ్ రేప్ చేస్తామంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను బెదిరిస్తున్నారంటూ మీరా చోప్రా తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసింది.

దీంతో ఈ వివాదం కాస్త మరింత ముదిరినట్లు కనిపిస్తోంది.తారక్ ఫ్యాన్స్ వల్ల తనకు ప్రాణ హాని ఉందంటూ కేటీఆర్‌కు ఆమె ట్వీట్ చేయడంతో ఈ వివాదం ప్రస్తుతం అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.

కాగా మీరా చోప్రా ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు.హైదరాబాద్ డీజీపీని ట్యాగ్ చేస్తూ, మీరా చోప్రా రక్షణను తమ భాద్యతగా తీసుకుంటామని ఆయన అన్నారు.

మొత్తానికి ఎన్టీఆర్-మీరా చోప్రా వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ వివాదం ఎటు నుండి ఎటు వెళ్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే బెదిరింపులకు పాల్పడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కఠినమైన శిక్ష విధించాలని కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు.

మరి ఈ వివాదంపై తారక్ ఏమైనా స్పందిస్తాడా లేక మౌనంగానే ఉంటాడా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ktr Ntr Meera Chopra Related Telugu News,Photos/Pics,Images..

footer-test