కేసీఆర్ తర్వాత సీఎం ఆయనే బాంబు పేల్చిన మంత్రి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోడంటూ ప్రతిపక్షాలు తమ వ్యతిరేకతను అవకాశం వచ్చినప్పుడల్లా తెలియజేస్తున్నాయి.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తుందని, కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడంటూ కాంగ్రెస్, బీజేపీ లాంటి ప్రతిపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి.

 Ktr Next Cmafter Kcr Says Srinivas Goud-TeluguStop.com

అయితే ప్రతిపక్షాలకు చురకలంటించారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.కేసీఆర్ జనవరి 30న ఎలాంటి మీటింగ్ పెట్టడం లేదని ఆయన తేల్చారు.మతం పేరుతో అధికారాన్ని చేపట్టాలని భాజపా చూస్తోందని ఆయన విమర్శించారు.అటు కాంగ్రెస్‌ పార్టీలో సొంత భార్యను గెలిపించలేకపోయిన ఉత్తమ్ కుమార్‌కు కేసీఆర్‌పై విమర్శలు చేసే అర్హత లేదని ఆయన ఎద్దేవా చేశారు.

ఇక మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

Telugu Srinivas Goud, Telangana Cm-Political

యావత్ దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుందని, యువత మొత్తం కేటీఆర్ వైపు చూస్తుందని ఆయన అన్నారు.కేసీఆర్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే పూర్తి అర్హత కేవలం కేటీఆర్‌కు ఉందని ఆయన వెల్లడించారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube