సాగర్ లో గెలుపు టి‌ఆర్‌ఎస్ దే.. జానారెడ్డి ని ప్రజలు మరచిపోయారు

నాగార్జున సాగర్ ఎం‌ఎల్‌ఏ నోముల నర్సింహయ్య గత కొన్ని నెలల కిందట అనారోగ్యం కారణంగ చనిపోవడంతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయింది.దానిని భర్తీ చేసేందుకు ఉప ఎన్నిక ను నిర్వహించబోతున్నారు.

 Ktr Meeting With Nalgonda Distict Mla And Mp's, Huzur Nagar, Kcr, Ktr, Mlc Elect-TeluguStop.com

రాష్ట్ర అధికార ప్రతి పక్ష పార్టీలు ఆ సీటు ను గెలుచుకోవాలని చూస్తున్నాయి.కాంగ్రెస్ నుండి జానా రెడ్డి గాని ఆయన తనయుడు గాని పోటీ చెయ్యబోతున్నారని సమాచారం.

టి‌ఆర్‌ఎస్ నుండి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై టి‌ఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కే‌టి‌ఆర్ నల్గొండ జిల్లా మంత్రులు ఎం‌ఎల్‌ఏలు, ఎం‌పి‌టి‌సి లు జెడ్‌పి‌టి‌ఎస్ లు పలువురు నాయకులతో సమావేశం అయ్యాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజూర్ నగర్ ఉప ఎన్నిక మాదిరి నాగార్జున సాగర్ కూడా టి‌ఆర్‌ఎస్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశాడు.2018 లో జానారెడ్డి పై గెలిచాం.అప్పుటి నుండి ప్రజలకు దూరం అయ్యాడు.

ప్రజలు కూడా ఆయనను మరిచిపోయారు అన్నాడు.హుజూర్ నగర్ ఎన్నికలను స్పూర్తి గా తీసుకొని నాగార్జున సాగర్ ఎన్నికల్లో స్థానిక పార్టీ నేతలు సత్తా చాటలని అన్నాడు.

అదేవిదంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల పై నాయకులతో చర్చించాడు.సరైన వ్యూహం తో ప్రజల్లోకి వెళ్లాలని సూచించాడు.

ఈనెల 22 లేదా 23 వ తేదీన హాలియాలో కే‌సి‌ఆర్ భారీ బహిరంగ సభను ఉంటుందని కే‌టి‌ఆర్ అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube