మోదీ లోగో కాపీ

కాపీ కొట్టడం అనే ప్రక్రియ అన్ని రంగాల్లో ఉంది.విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొడితే, రచయితలు వేరేవారి పుస్తకాల్లో నుంచి కాపీ కొడతారు.

 Ktr Launches Make In Telangana-TeluguStop.com

పారిశ్రామిక, వస్తూత్పత్తి రంగాల్లో వివిధ రకాల ఉత్పత్తులను కాపీ కొడుతుంటారు.వీటిని నకీలీ అంటారు.

కాపీ, నకిలీ ఇవన్నీ దగ్గర పోలికలు ఉన్నవే.ఇక అసలు విషయానికొస్తే నరేంద్ర మోదీ తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న ఓ లోగోను తెలంగాణ ప్రభుత్వం కాపీ కొట్టింది.

మోదీ సర్కారు సృష్టించిన ‘మేకిన్‌ ఇండియా’ నినాదం చాలా పాపులర్‌ అయింది.సింహం బొమ్మ మీద ఆంగ్లంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అని ఉంటుంది.

సింహం బొమ్మలో పారిశ్రామిక పరికరాలుంటాయి.ఇదే లోగోను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది.

మేక్‌ ఇన్‌ ఇండియా బదులు ‘మేక్‌ ఇన్‌ తెలంగాణ’ అని ఉంటుంది.రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి దీన్ని ఆవిష్కరించారు.

దీనికి సంబంధించి విడుదల చేసిన వీడియోలో తెలంగాణ పరిశ్రమలకు ఎలా అనుగుణంగా ఉందో, పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తాయో మొదలైనవి వివరించారు.ప్రభుత్వం తన అధికారిక లోగోను (రాజముద్ర) తయారు చేసుకున్నప్పుడు పారిశ్రామిక విధానం కోసం లోగో తయారు చేసుకోలేదా? కాపీ కొట్టడం ఎందుకు? మోదీ లోగోకు మించి తయారు చేయలేమని అనుకున్నారో ఏమో…!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube