కేటీఆర్‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే వ్య‌తిరేక‌త‌.. ఎందుకిలా..?

ఇప్పుడు రాష్ట్రంలో బ‌ల‌మైన నేత‌గా ఉన్న వారిలో ముందుగా గుర్తుకు వ‌చ్చేది కేటీఆర్‌.కేసీఆర్ కొడుకుగా భావి త‌రాల‌కు సీఎంగా ఆయ‌న దూసుకుపోతున్నారు.

 Ktr Is Opposed In Its Own Constituency Why, Ktr, Ts Plitics, Kcr, Ktr Future Cm,-TeluguStop.com

ఇప్ప‌టికే ఎన్నో పార్టీల‌ను ఆయ‌న ప్ర‌భావితం చేసే స్థాయిలో ఉంటున్నారు.ఇలాంటి త‌రుణంలో ఇప్పుడు ఆయ‌న ఇమేజ్ మ‌రింత పెర‌గాలంగే సొంత నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని మెజార్టీ ఆయ‌న దూసుకుపోవాల్సి ఉంటుంది.

కానీ ఇప్పుడు ఆయ‌న‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.అదేనండి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్లలోనే.

మొన్న నాలుగు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం అంద‌రికీ విదిత‌మే.కాగా ఈ వ‌ర్షాల కార‌ణంగా ప్ర‌ధానంగా య‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల‌లోని ప‌లు కాలనీల్లో ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చి జ‌నం నానా ఇబ్బందులు ప‌డ్డారు.

అయితే ఇందులోని చాలా కాలనీల రోడ్లలో నీరు నిలిచి కాలువల్లా మారిపోయాయంటే ప‌రిస్థితులు ఎలాఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.ఈ కార‌ణాల‌తో జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయింది.దీంతో మంత్రి కేటీఆర్ ఎక్క‌డా అంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వినిపించాయి.

వ‌క వర్షాలు త‌గ్గిన త‌ర్వాత గురువారం ఆయ‌న త‌న నియోజకవర్గమైన శాంతినగర్ లోని కార్మిక వాడలో కేటీఆర్ ప‌ర్య‌టించి ఇబ్బందులను తెలుసుకున్నారు.

Telugu Heavy, Ktr Cm, Roads Damaged, Shantinagar, Trs, Ts Plitics, Ts-Telugu Pol

అయితే ఆయ‌న్ను ఆ స్థానిక మహిళలు తిట్టిపోశారు.వర్షాలు ప‌డ్డ‌ప్పుటు ఎక్క‌డ పోయారని, ఇప్పుడు తగ్గిపోయిన తర్వాత వ‌స్తే ఏం క‌నిపిస్తాయ‌ని ప్ర‌శ్నించారు.దీంతో కేటీఆర్ కూడా నొరెత్తకుండా మౌనంగా ఉండిపోయారు.వారే కాదు ఆయ‌న ఏ కాల‌నీల్లో తిరిగినా కూడా ఇదే విధంగా విమ‌ర్శ‌లు వినిపించాయి.వ‌ర్షాలు ప‌డ్డ‌ప్పుడు సిరిసిల్ల‌కు ఎందుకు రాలేదంటూ నిల‌దీశారు జ‌నాలు.మొత్తానికి కేటీఆర్ కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఇలా నిర‌స‌న‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఇలా నిర‌స‌న సెగులు కేటీఆర్ కు ఈ రేంజ్‌లో త‌గ‌ట‌డం ఇదే మొద‌టిసారి అని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube