సంచలన నిర్ణయాలతో ఫుల్ జోష్ లో కెటీఆర్.. అసలు వ్యూహం ఇదేనా?

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే చాలా వరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలనే ఉద్దేశ్యంతో భారీ వ్యూహాలను పన్నుతూ ముందుకు సాగుతోన్న పరిస్థితి ఉంది.

 Ktr In Full Josh With Sensational Decisions Is This The Real Strategy Trs Party,-TeluguStop.com

అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రతిపక్షాల వ్యూహంలో చిక్కుకోకుండా పాలనతోనే సమాధానం చెప్పాలన్న ధోరణితో ముందుకు నడుస్తున్నట్టు తెలుస్తోంది.కాని ఎక్కడా తమంతట తాముగా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంపై దృష్టి పెట్టకుండా టీఆర్ఎస్ అనుకూల వాతావరణాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

ముఖ్యంగా గత కొద్ది నెలలుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా రకాల విషయాలపై ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా స్పందిస్తున్న పరిస్థితి ఉంది.

Telugu @cm_kcr, @ktrtrs, @trspartyonline, Telangana-Political

అంతేకాక సంచలన నిర్ణయాలు, సంచలన విజయాలతో ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీ అనుకూల వాతావరణం అనేది ఏర్పడింది.రాష్ట్రానికి అమూల్ లాంటి ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ అనేది దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించింది.అయితే చేనేత ఉత్పత్తులపై 5 శాతం నుండి 12 శాతం జీఎస్పీ పెంపు నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించగా ఈ నిర్ణయంతో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం, మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేంద్రం దిగి వచ్చి చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నదని చెప్పుకోవచ్చు.

దీంతో ఒక్కసారిగా అభివృద్ధి వైపు ప్రజల చూపు మరల్చి అభివృద్ధి ఫలాలు అనేవి ప్రజల్లోకి వెళ్ళే విధంగా అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెడుతూ ఫుల్ జోష్ లో మంత్రి కేటీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube