మంత్రి ఈటెలను బుజ్జగించే ప్రయత్నంలో కేటీఆర్...చల్లబడేనా?

ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఒక్క దుబ్బాకలో తప్ప మిగతా అన్ని చోట్లా గెలిచి తన పట్టును నిలబెట్టుకుందని చెప్పవచ్చు.ఇప్పటికే రెండు పర్యాయాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్, అయితే ఇంకో రెండేళ్లలో ఎన్నికలు ఉండనున్న తరుణంలో ఎవరి అక్కాకంక్షలు వారికి ఉంటాయి.

 Ktr In An Attempt To Appease The Minister Eetela Rajendra Prasad, Cm Kcr, Minist-TeluguStop.com

అయితే కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా అందరికీ రావలసినన్ని అవకాశాలు రావు.అందులో భాగంగానే కొందరు అసంతృప్తికి గురవుతుంటారు.

అయితే మంత్రి ఈటెల కూడా తరచూ కొన్ని ప్రభుత్వానికి చిక్కులు తెచ్చి పెట్టే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే అప్పట్లోనే ఈటెల మాటలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమయ్యాయి.

ఇటీవల వీణవంక మండలంలో పర్యటన సందర్బంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లు పేదరికం నుండి కాపాడవు అని ఇంకా వేదాంత పూర్వక వ్యాఖ్యలు చేయడంతో మరొక్క సారి ఈటెల మాటలు రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారాయి.అయితే నేను అసెంబ్లీ సమావేశాల నుండి నేరుగా ప్రగతి భవన్ కు ఈటెలను తీసుకెళ్లిన కేటీఆర్ కేసీఆర్ కు, ఈటెలకు రాజీ చేసే ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది.

ఏది ఏమైనా అసంతృప్తి జ్వాలలు ఏ పార్టీకైనా మంచివి కావనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరి టీఆర్ఎస్ లో ఈ అసంతృప్తి జ్వాలలు ఎప్పుడు చల్లబడుతాయో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube