నాలుగేళ్ల బుడతడు క్రికెట్... ఫిదా అయినా కేటీఆర్

ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.ఆ టాలెంట్ ని గుర్తించి సాన బెడితే అందులో వారు మంచి సామర్ధ్యం సొంతం చేసుకొని తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంటారు.

 Ktr Impressed 4 Years Kids Cricket Talent, Telangana, Hyderabad, Vvs Laxman, Ind-TeluguStop.com

ఇలాంటి పిల్లలలో టాలెంట్ ని చిన్న వయసులో గుర్తించడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.చాలా మంది తల్లిదండ్రులు పిల్లలని చదువుల పేరుతో విపరీతంగా ఒత్తిడి చేస్తూ ఉంటారు.

అదే సమయంలో వారిలో ఉన్న టాలెంట్ ని ప్రోత్సహించే ప్రయత్నం చేయరు.కొంత మంది మాత్రం తమ పిల్లలలో ఉన్న టాలెంట్ ని గుర్తించి వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తూ ఉంటారు.

దీంతో ఆపిల్లలు కూడా ఇష్టమైన రంగంలో తమ టాలెంట్ తో దూసుకుపోతూ ఉంటారు.ఇలాంటి పిల్లల టాలెంట్ కి సంబందించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దీనిని తెలంగాణ ఐటీ మినిష్టర్ కేటీఆర్ స్వయంగా ట్యాగ్ చేయడం విశేషం.

డైపర్లు వేసుకునే వయసులోనే బ్యాట్ పట్టి సునాయాసంగా క్రికెట్ ఆడిన ఆ బుడతడు నాలుగేళ్ల వయస్సు వచ్చేసరికి ఏకంగా ప్యాడ్ కట్టి క్రికెట్ బాల్ ని బౌండరీలు దాటించేలా బ్యాటింగ్ చేస్తున్నాడు.ఆ బుడతడి క్రికెట్ విన్యాసాలకి ముగ్ధుడైన కేటీఆర్ దాన్ని ట్యాగ్ చేసి అమోఘమైన ప్రతిభ అంటూ కితాబిచ్చారు.ఈ వీడియో పట్ల ఏమంటారు వీవీఎస్ లక్ష్మణ్, హర్షాభోగ్లే? అంటూ వారిద్దరినీ ట్యాగ్ చేశారు.దీనిపై లక్ష్మణ్ వెంటనే స్పందించారు.

నిజంగానే ఆ చిన్నారిలో అద్భుత నైపుణ్యం ఉందని తాను అంగీకరిస్తానని ట్వీట్ చేశారు.ఇంత చిన్న వయసులోనే కచ్చితమైన టెక్నిక్ తో ఆడుతున్న ఆ చిన్నారిలో ప్రత్యేక ప్రతిభ ఉందని పేర్కొన్నారు.

ఇలాంటి టాలెంటెడ్ చిన్నారికి ప్రభుత్వం తరుపున కేటీఆర్ ఎలాంటి ప్రోత్సాహం అందిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.కేటీఆర్ ట్యాగ్ చేయడంతో వీడియో కూడా ట లో వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube