ట్విట్టర్ లో కేటీఆర్ ఫన్నీ ట్వీట్..! చూస్తే నవ్వాపుకోలేరు..!       2018-06-23   00:56:05  IST  Raghu V

మంత్రి కెటిఆర్ ట్విటర్లో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే.. అంతే యాక్టివ్ గా ఏదన్నా సమస్య ఉందన్నా వెంటనే స్పందిస్తారు.అంతేకాదు తనలోని హాస్యప్రియున్ని కూడా ఒకసారి పరిచయం చేశారు ఈ మధ్య ఒక జోక్ ట్వీట్ చేసి అభిమానులను నవ్వుల్లో ముంచెత్తారు.మరోసారి ఇంకొకరు సాయం కోసం రెండు రాష్ట్రాల అధినేతలను కోరితే కెటిఆర్ వెంటనే స్పందించారు..ఇలా ఒకటి రెండే కాదు బోలెడు ఉదాహరణలున్నాయి కెటిఆర్ ట్విటర్ లో ట్వీట్స్ కి సంభందించి..అయితే న్యూ ఇయర్ కి డిజె పెట్టుకుంటాం పర్మిషన్ ఇవ్వండి సర్ అంటూ సాయికుమార్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తే దానికి కెటిఆర్ భలే చాతుర్యంతో స్పందించారు..

తాజాగా ఓ చిన్నారి హోంవర్క్‌ సంబంధించిన ఓ పత్రాన్ని షేర్‌ చేస్తూ కేటీఆర్‌ ఓ ఫన్నీ ట్వీట్‌ చేశారు. ‘జీవితంలో షార్ట్‌కట్స్ లేవని ఎవరన్నారు?. ఈ చిన్నారి ఎంత స్మార్ట్‌… చిన్నారితో పాటు ఆ టీచర్‌ కూడా అంతే స్మార్ట్.’ అంటూ కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ నవ్వులు పూయిస్తోంది.

ఓ చిన్నారికి తన హోంవర్క్‌ సంబంధించి ఆకలితో ఉన్న పిల్లి ఏ మార్గం గుండా వెళ్లి పాలు తాగుతుందో దారి చూపించండి అని ఓ ఫజిల్‌ అడిగారు. దానికి చిన్నారి ఫజిల్‌ లోపల ఎలా వెళ్లాలనేదాని గురించి ఆలోచించకుండా, పిల్లి నుంచి పాలకు షార్ట్‌కట్‌గా గీత గీసి ఫజిల్‌ పూర్తి చేసింది. విద్యార్థి జవాబుకి టీచర్ కూడా రైట్ మార్కు వేసి.. స్టార్‌ సింబల్‌ కూడా ఇచ్చారు. అందుకే ఈ చిన్నారి తెలివితేటలకు ఫిదా అయిన కేటీఆర్ ట్వీటర్‌ ద్వారా ఆ విషయాన్ని పంచుకున్నారు. ఇపుడా ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది.