టెన్త్ విద్యార్ధినికి కేటీఆర్ స్నేహితుడి సాయం

మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత వరకు పరిష్కరిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.ఆయన సోషల్ మీడియా సాయంతో చేసిన సహాయంతో చాలా మంది లబ్దిపొందారు.

 Ktr Friend Helps Tenth Student-TeluguStop.com

ఇదే విషయం తెలుసుకున్న ఓ పదో తరగతి విద్యార్ధిని తనకు సాయం చేయాలంటూ కేటీఆర్‌ను ట్విట్టర్‌లో కోరింది.

బెంగుళూరులో పదో తరగతి చదువుతున్న శిల్పారెడ్డికి ఇటీవల వెన్నుముక్కకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది.

దీంతో ఆమె నడుముకు దాదాపు లక్ష రూపాయల విలువగల బెల్టును ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.అయితే తమ ఆర్ధిక స్థోమత అంత లేదని ఆ అమ్మాయి కేటీఆర్‌ను ట్విట్టర్‌ ద్వారా కోరింది.

తనకు సహాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఆమె కేటీఆర్‌ను వేడుకుంది.అయితే ఆమె ఇతర రాష్ట్రానికి చెందినది కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాను సహాయం చేయలేకపోతున్నానంటూ కేటీఆర్ తెలిపారు.

Telugu Financial, Ktr, Tenth-

ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ స్నేహితులు ఒకరు శిల్పారెడ్డికి రూ.90 వేల ఆర్ధిక సాయం అందించారు.ఈ మేరకు ఆర్ధిక సాయానికి సంబంధించిన చెక్కును శిల్పా తండ్రి నందీష్‌రెడ్డికి కేటీఆర్ చేతులుమీదుగా అందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube