రేవంత్ విషయంలో అనవసరంగా అలా చేస్తున్న కేటీఆర్..

ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్న మాదిరిగా రాజకీయాలు సాగుతున్నాయి.ఇప్పటికీ ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటూ రాజకీయాలు చేస్తున్నారు.

 Ktr Doing So Unnecessarily In The Case Of Revanth ., Revanth, Ktr , Ts Potics ,-TeluguStop.com

అయితే రేవంత్ విషయంలో కేటీఆర్ కొన్ని పాయింట్లు మిస్ అవుతున్నట్టు తెలుస్తోంది.రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాకముందు ఆయన ఎన్ని ఆరోపణలు చేసినా పెద్దగా పట్టించుకోని కేటీఆర్.

ఇప్పుడు టీపీసీసీ అయిన తర్వాత రేవంత్ చేస్తున్న ప్రతి విమర్శకు కౌంటర్ వేయాలని లేదంటే రిప్లై ఇవ్వాలని చూస్తున్నారు.

ఇదే రేవంత్ పై చేయి సాధించేందుకు ఆస్కారంగా మారింది.

కాగా రీసెంట్ గా శశిథరూర్ ఎపిసోడ్ లో మాత్రం కేటీఆర్ గట్టి దెబ్బ కొట్టారని చెప్పొచ్చు.రేవంత్ ఆడియో క్లిప్ ను బయటపెట్టి ఉక్కిరిబిక్కిరి చేశారు.

మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు రేవంత్ రెడ్డి దిగిరాక తప్పలేదు.చివరకు బహిరంగంగానే సారీ చెప్పేశారు.

కాగా ఈ ప్రభావం నుంచి బయటపడేందుకు రేవంత్ రెడ్డి డ్రగ్స్ ఎపిసోడ్ వైపునకు మళ్లించారు.

Telugu Drugs, Gunpark, Ktr, Rahul Ghandhi, Revanth, Revnath, Shshi Tharoor, Trs,

కాగా కేటీఆర్ రేవంత్ ఎత్తుగడను గమనించకుండా అనవసరంగా దాని మీద ఓవర్ గా రియాక్టు అయ్యారు.అవసరానికి మించి కేటీఆర్ ట్వీట్ల మీద ట్వీట్లు చేయడం అలాగే ఈ గొడవలోకి రాహుల్ గాంధీని తీసుకురావడంతో శశిథరూర్ ఎపిసోడ్ పక్కకు పోయి ఈ విషయం తెరమీదకు వచ్చింది.దీంతో రేవంత్ గన్ పార్క్ దగ్గరకు రావడం కేటీఆర్ టెస్టుకు వచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పడంతో కేటీఆర్ మీద డిమాండ్ పెరుగుతోంది.

దీంతో రేవంత్ రెడ్డి ఈ విషయంలో పై చేయి సాధించినట్లు అయింది.కానీ కేటీఆర్ ఇలా ప్రతి దానికి స్పందించకుండా ఉంటే గనక రేవంత్ మీదే వ్యతిరేకత ఉండేదని, కానీ రేవంత్ వేస్తున్న ఎత్తుగడలను కేటీఆర్ తిప్పి కొట్టలేకపోతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube