కేటీఆర్ తన పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న దేవిశ్రీప్రసాద్..!

సోషల్ మీడియా ప్రతి ఒక్కరిలో ఉన్న టాలెంట్ ని వెతికితీస్తుంది.మన పేరును ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది.

 Ktr Devisriprasad Maintains Faith In Himself ..! Ktr, Devi Sri Prasad, Social Me-TeluguStop.com

సోషల్ మీడియా కొందరికి సరదాని ఇస్తే.మరికొందరికి జీవితాన్ని ఇస్తుంది.

మనలో ఉన్న టాలెంట్ ను బయట ప్రపంచానికి చూపించడానికి సోషల్ మీడియా ఓ మంచి వేదిక.నిజానికి ఇటీవల టిక్ టాక్ వల్ల ఎంతో మంది ఫేమస్ కూడా అయ్యారు.

కొంతమంది దానితో లైఫ్ కూడా సెట్ చేకున్నారు.అయితే ఇటీవల పల్లెలో దాగి ఉన్న ఓ కోయిలమ్మ గానం విన్న మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశాడు.

దానికి స్పందించిన దేవిశ్రీ ప్రసాద్ మంత్రికి మాట ఇచ్చాడుఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్నాడు.అయితే మంత్రి ఏం అడిగాడు దేవిశ్రీ ఏం చేశాడో చూద్దాం.

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాకు చెందిన గాయని ఓ పాట పడింది.ఆ పాట సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ మంత్రి కేటీఆర్ కంటపడింది.ఆ పాట విన్న మంత్రి కేటీఆర్ ఇలాంటి టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి అంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ, తమన్ లాంటి వారిని ట్యాగ్ చేస్తూ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు.మంత్రి ట్వీట్ చూసిన దేవిశ్రీ ప్రసాద్ వెంటనే స్పందించాడు.

తాను చేస్తున్న రాక్ స్టార్ ప్రోగ్రాంలో ఆ గాయనితో పాట పాడిస్తా అంటూ మాట ఇచ్చాడు.ఇచ్చిన మాటను దేవిశ్రీ నిలబెట్టుకున్నాడు కూడా.

Telugu Devi Sri Prasad, Medak Dist, Music, Palalodagi, Lady, Meida, Telengan-Lat

ఇటీవల నిర్వహించిన షో లో ఆ గాయనితో పాట పాడించాడు.ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ మాట నిలబెట్టుకున్న అంటూ మరో ట్వీట్ చేశాడు.అంతేకాకుండా యువతి చాలా అద్భుతంగా పడింది అంటూ ఆమె ప్రతిభను మెచ్చుకున్నాడు.దేవిశ్రీ చేసిన ట్వీట్ చూసిన మంత్రి మంచి పని చేశావ్ బ్రదర్ అంటూ దేవీశ్రీ ని పొగిడేశాడు.

ఈ సోషల్ మీడియా వల్ల కొమ్మల్లో దాగి ఉన్న ఓ కోయిలమ్మ ప్రపంచానికి తెలిసిపోయింది.కాబట్టి మీలో ఏదైనా స్పెషల్ ప్రతిభ ఉంటే దానిని ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుంటే మీరు కూడా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube