మా ప్రమేయమే లేదు

టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ముడుపుల ఉదంతంలో ఇంకా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.టీడీపీ, టీఆర్ఎస్‌ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.

 Ktr Denies Allegations Over Ap Cm Ppone Being Tapped-TeluguStop.com

రేవంత్‌ రెడ్డి తప్పు చేయలేదని, కుట్ర చేసి ఇరికించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తుండగా, ఆయన అరెస్టుతో తమకు సంబంధమే లేదని, అదంతా చట్టప్రకారమే ఏసీబీ అధికారులు చేశారని అంటున్నారు.నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌ సంభాషణల టేపు విడుదల చేయడంతో రెండు రాష్ర్టాల మధ్య రాజకీయం వేడెక్కింది.

ఏసీబీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు పంపుతారనే వార్తలు షికారు చేస్తుండగానే టీడీపీ ఆంధ్రా నాయకులు కేసీఆర్‌పై పరువు నష్టం కేసులు వేశారు.ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రేవంత్‌ రెడ్డి అరెస్టు విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.

చంద్రబాబు ఫోన్లను తాము ట్యాప్‌ చేయలేదన్నారు.దాంతో సర్కారుకు సంబంధం లేదన్నారు.

రెండు రాష్ర్టాల మధ్య గొడవలు పెట్టేందుకు టీడీపీ నాయకులే ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.రేవంత్‌ రెడ్డి ఎపిసోడ్‌పై చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.

రేవంత్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.ఏసీబీయే మొత్తం చేసిందనేది కేటీఆర్‌ మాటాల సారాంశం.

మన దేశంలో సీబీఐ, ఏసీబీ సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తాయంటే ఎవరు నమ్ముతారు? రేవంత్‌ తప్పు చేశాడు నిజమే.కాని ఏసీబీ ప్రభుత్వ డైరెక్షన్‌ లేకుండా పనిచేస్తుందా?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube