ఫొటోటాక్‌ : కేటీఆర్‌కు నచ్చిన వైరల్‌ ఫొటో

మహమ్మారి కరోనాకు మందు లేని ఈ సమయంలో జాగ్రత్తలు పాటించడమే అసలైన మందు అంటూ నాయకులు, సెలబ్రెటీలు ఎంత చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు జనాలు.చాలా చోట్ల సామాజిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు.

 Ktr Corona Virus Social Distance Ktr Twitter Telangana Kirana Shops Social Distance-TeluguStop.com

పోలీసులు లాఠీ చార్జ్‌ చేస్తున్నా ఎంత మొత్తుకుంటున్నా కూడా వినిపించుకోవడం లేదు.షాప్స్‌ వద్ద కనీసం జాగ్రత్తలు పడక పోవడంపై పదే పదే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

ఇలాంటి సమయంలో పిల్లలు కిరాణా షాప్‌ వద్ద సామాజిక దూరం పాటించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

 Ktr Corona Virus Social Distance Ktr Twitter Telangana Kirana Shops Social Distance-ఫొటోటాక్‌ : కేటీఆర్‌కు నచ్చిన వైరల్‌ ఫొటో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఫొటో ఎక్కడ తీశారో ఏమో కాని సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది.

ఆ ఫొటోను కేటీఆర్‌ కూడా ట్వీట్‌ చేశాడు.ట్విట్టర్‌లో ఇలాంటివి చాలా ఆసక్తిగా చూసే కేటీఆర్‌ తాజాగా ఈ ఫొటోను షేర్‌ చేసి ఈ పిల్లలు మనకు బుద్ది చెబుతున్నారు.

సామాజిక దూరం పాటించని వారికి ఇది తగిన గుణపాఠం అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశాడు.ఈ వారంలో నా అభిమాన చిత్రం అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేయడంతో ఈ ఫొటో మరింతగా వైరల్‌ అయ్యింది.

ఈ పిల్లలను చూసి అయినా కాస్త సామాజిక దూరం పాటించండి.

#Corona Virus #Telangana #KTR Twitter #KiranaShops #Distance

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు