ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు విదేశీ పెట్టుబడుల కోసం అర్రులు చాస్తున్నాయి.విదేశీయులు , ప్రవాసాంధ్రులు వచ్చి పెట్టుబడులు పెట్టకపోతే,పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే బతుకు బస్టాండు అయిపోతుందని ఇద్దరు చంద్రులు భావిస్తున్నారు.
విదేశీ పెట్టుబడిదారులు వచ్చి ఉద్ధరించకపోతే తెలుగు ప్రజలు జీవనం సాగించలేరని డిసైడైపోయారు.అధికారం చేపట్టగానే ఇద్దరు ముఖ్యమంత్రులు పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లారు.
తమ ఉదారవాద విధానాలు వివరించారు.అవసరమైతే ఒక్క రోజులోనే అన్ని అనుమతులు ఇస్తామన్నారు.
ఎంత భూమి కావాలన్నా ఇస్తామన్నారు.కరెంటు కొరతలేదన్నారు.‘మీరు వచ్చి పరిశ్ర మలు పెడితే చాలు మా రాష్ర్టాలు పునీతమవుతాయి’ అంటూ ఊదరగొట్టారు.ఇద్దరు చంద్రులు తిరిగి తిరిగి వచ్చి అలసిపోయి ప్రస్తుతం తమ పుత్రరత్నాలను పంపారు.
కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్, మంత్రి పదవి లేకపోయినా అంతటి హోదా ఉన్న బాబు కుమారుడు లోకేష్ అమెరికా వెళ్లారు.కేటీఆర్ కీలకమైన ఐటీ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ హోదాలో పెట్టుబడులు తెస్తారని అనుకుంటున్నారు.
ప్రస్తుతం ఆయన యూఎస్‌లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాసాంధ్రులను, అమెరికన్ పారిశ్రామివేత్తలను ఒప్పిస్తున్నాడట….! ఆయన బోయింగ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు మార్‌్క అలెన్‌ను కలిసి తెలంగాణలో ఏరో స్పేస్ పార్‌్క ఏర్పాటు చేయాలని కోరారు.
ఇందుకు ఆదిభట్ల ఏరోస్పేస్ సెజ్‌లో వెయ్యి ఎకరాలు ఇస్తామన్నారు.నిజామాబాద్, వరంగల్‌లోనూ ఏరోస్పేస్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు.
దేశంలోనే విమానాల తయారీకి తెలంగాణను కేంద్రంగా మారుస్తామన్నారు.కేటీఆర్ ఇంకా చాలా మందిని కలువబోతున్నారు.
కేటీఆర్ ఎంతమందిని కన్విన్స్ చేస్తారో, ఎన్ని కోట్ల పెట్టుబడులు తెస్తారో చూడాలి.పెట్టుబడులతో వచ్చి తండ్రికి పుత్రోత్సాహం కలిగిస్తాడా?
.