లగడపాటి గుట్టు విప్పిన కేటిఆర్..??     2018-12-05   12:13:39  IST  Surya

తెలంగాణలో ఎన్నికల హీట్ ని లగడపాటి ఒక్క సారిగా పెంచేశాడు..తెలంగాణలో తనకొచ్చిన ఇబ్బంది ఏముంది లే అనుకున్నాడో ఏమో కాని మొత్తానికి లగడపాటి చివరి నిమిషంలో పెద్ద బాంబే పేల్చాడు. మొత్తం సీట్లు “హస్త” గతం అయ్యేది కూటమికే అంటే డబ్బా కొట్టేశాడు దాంతో ఒక్క సారిగా తెలంగాణలో అలజడి రేగింది, పార్టీలలో కన్ఫ్యూజన్ మొదలయ్యింది..ప్రజలో క్లారిటీ మిస్ అయ్యింది అయితే వీటన్నిటికి కేటిఆర్ ఒకే ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టారు..దాంతో లగడపాటి సర్వే తుస్సు మంది..

KTR Comments On Lagadapati Rajagopal-Kavitha KCR Rajagopal Telangana Elections TRS

మాజీ ఎంపీ లగడపాటి చెప్పిన జోస్యం లో ఎలాంటి నిజాలు లేవని ఇందంతా బాబు కోసం లగడపాటి చేసిన మ్యాజిక్ అని కేటిఆర్ కొట్టిపారేశారు..ఆయన పెట్టిన ఒకే ఒక్క ట్వీట్ తో కూటమికి దిమ్మ తిరిగిపోయింది.

లగడపాటి తన సర్వేలో వెల్లడైన ఫలితాలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన ఒత్తిడికి నిదర్శనమని అన్నారు..ఏపీలో తనకి ఎక్కడ పొగబెట్టి మరీ తోక్కుతాడో అంటూ తీవ్రంగా భయపడిన లగడపాటి బాబు కి అనుకూలంగానే మార్కులు వేశారని అన్నారు..

KTR Comments On Lagadapati Rajagopal-Kavitha KCR Rajagopal Telangana Elections TRS

అయితే ఈ క్రమంలోనే లగడపాటి తనకి పంపిన సీక్రెట్ మెసేజ్ ని కేటిఆర్ బయట పెట్టారు..గతంలో ఇదే లగడపాటి టిఆర్ఎస్ పార్టీకి 65 నుంచి 70 సీట్లు వస్తాయంటూ గత నెల 20వ తేదీన మెసేజ్ తనకి పంపారని ట్విట్టర్ లో షేర్ చేశారు దాంతో కూటమి నేతలు షాక్ అయ్యారు..కేవలం చంద్రబాబు కుట్రను ప్రజలకు తెలియజేసేందుకు లగడపాటి తనకు పంపిన మెసేజ్ ను షేర్ చేయాల్సి వస్తుందని..తెలంగాణా ప్రజలకి కూటమి బ్యాచ్ చేసే కుట్రల్ని తెలియచేయడం తన భాద్యతని ఆయన అన్నారు…దాంతో లగడపాటి నిన్న చెప్పిన సర్వే ఉత్తుత్తి సర్వేనే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలంగాణా ప్రజలు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.