లగడపాటి సర్వేల నుంచి కూడా సన్యాసం తీసుకుంటారు  

టీఆర్ఎస్ పార్టీ నాయకులు లగడపాటి రాజగోపాల్ పేరు చెప్తే చాలు… ఒంటి కాలిమీద లేస్తున్నారు. తెలంగాణాలో ఎన్నికల పర్వం ముగిసిన తరువాత లగడపాటి ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టడం… ఆ తరువాత ఆయన మీద టీఆర్ఎస్ నాయకుల ఎదురుదాడి జరగడం రెండు రోజులుగా చూస్తూనే ఉన్నాము. తాజాగా టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మహాకూటమిలోని పార్టీలు చేస్తున్న ఆరోపణల మీదా… లగడపాటి రాజగోపాల్ మీద తనదయిన శైలిలో సెటైర్లు వేశారు.

Ktr Coments On Lagadapati Rajagopal Surveys-

Ktr Coments On Lagadapati Rajagopal Surveys

పోలింగ్ అయిన తర్వాత స్ట్రాంగ్‌రూమ్‌లపై, ఈవీఎంలపై మహాకూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్టూ కుంటి సాకులు వెతుక్కుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. తాము ప్రజల్లో మాత్రమే స్ట్రాంగ్‌గా ఉన్నామని.. స్ట్రాంగ్‌ రూమ్‌లతో మాకు పనిలేదన్నారు. లగడపాటి రాజగోపాల్ ఎక్జిట్ పోల్ జరపకుండానే అంచనాలు ప్రకటించారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రాజగోపాల్‌.. ఫలితాల తర్వాత సర్వేల నుంచి కూడా సన్యాసం తీసుకుంటారని ఎద్దేవా చేశారు.