హుజూరాబాద్ కు దూరంగా కేటీఆర్‌.. కేసీఆర్ ప్లాన్ ప్ర‌కార‌మేనా?

ఈట‌ల రాజేంద‌ర్‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన‌ప్ప‌టి నుంచి సీఎం కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ఆయ‌న వ్య‌వ‌హారాన్ని కేవ‌లం కొంద‌రికే అప్ప‌జెబుతున్నారు.

 Ktr Away From Huzurabad Is It According To Kcr Plan, Ktr, Kcr, Etala Rajender, T-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే ఈట‌ల‌కు పార్టీలో స‌న్నిహితంగా ఉన్న నేత‌ల‌కే ఆయ‌న‌ను విమ‌ర్శించే బాధ్య‌త ఇస్తున్నారు.వారితోనే ఈట‌ల‌కు వైరం పెడుతున్నారు.

అందులో భాగంగానే ఇప్ప‌టికే ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీశ్‌రావును హుజూరాబాద్ రాజ‌కీయాల్లోకి దింపారు.అయితే మొత్తం ఈ వ్య‌వ‌హారాల‌కు కేటీఆర్‌ను పూర్తి దూరంగా ఉంచారు కేసీఆర్‌.

ఈట‌ల రాజేంద‌ర్‌కు ఎవ్వ‌రైతే అండ‌గా ఉంటార‌ని భావిస్తున్నారో వారితోనే ఈట‌ల‌కు చెక్ పెట్టిస్తున్నారు కేసీఆర్‌.కానీ కేటీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల‌పై ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు.

క‌నీసం ఆ వ్య‌వ‌హారాల‌పై ఒక్క నేత‌తో కూడా మీటింగ్ పెట్ట‌లేదు.ఇందుకు కార‌ణాలు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

కేటీఆర్‌పై ఎలాంటి రాజ‌కీయ విమ‌ర్శ‌ల రాకుండా చూసేందుకు కేసీఆర్ ఆయ‌న్ను సేఫ్ జోన్‌లోనే ఉంచుతున్నారు.ఒక‌వేళ కేటీఆర్ ఈ వ్య‌వ‌హారాల‌ను డీల్ చేస్తే ఆయ‌న‌పై ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కేసీఆర్ భావిస్తున్నారు.

ఇప్పుడ టీఆర్ఎస్‌లో కేసీఆర్ త‌ర్వాత కేటీఆర్ పెద్ద‌దిక్కుగా త‌యార‌వుతున్నారు.అలాంట‌ప్పుడు ప్ర‌జ‌ల నుంచి ప్ర‌తిప‌క్షాల నుంచి ఇప్ప‌టి నుంచే పాజిటివ్ వేవ్ వ‌చ్చే విధంగా చూసుకుంటున్నారు.

Telugu @ktrtrs, Kcr Huzurabad, Ktr Zone, Telangana, Shooterhareesh, Trs-Telugu P

కేటీఆర్‌ను కేవ‌లం ప్ర‌భుత్వ ప‌ర‌మైన ప‌నుల్లోనే ఉంచుతున్నారు కేసీఆర్‌.అప్పుడు కేటీఆర్ ప‌నిచేస్తున్నందున పాజిటివ్ వేవ్ ఆయ‌న చుట్టూ ఉంటుంది.కాబ‌ట్టి ప్ర‌జ‌ల్లో కూడా మంచి పేరు వ‌స్తుంది.భ‌విష్య‌త్తులో సీఎం కావాల్సిన కేటీఆర్‌ను ఇలాంటి రాజ‌కీయ దుమారాల‌కు కాస్త దూరంగా ఉంచాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.అప్ప‌డు ఆయ‌న‌ను డైరెక్టుగా సీఎం చేసినా పెద్ద వ్య‌తిరేక‌త ఏం ఉండ‌ద‌ని భావిస్తున్నారు కేసీఆర్‌.మొత్తానికి కేసీఆర్ అనుకున్న‌ట్టుగానే కేటీఆర్ ను సేఫ్ జోన్‌లో ఉంచి హ‌రీశ్‌రావును మాత్ర‌మే హుజూరాబాద్ ర‌ణ‌రంగంలో దింపారు కేసీఆర్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube