కేటీఆర్ పట్టాభిషేకం ఎప్పుడంటే ?  

KTR Sworn as Telangana CM after Greater Elections, Telangana CM KCR, KTR, Greater Elections, TRS Party - Telugu Greater Elections, Ktr, Ktr Sworn As Telangana Cm After Greater Elections, Telangana Cm Kcr, Trs Party

చాలా కాలంగా తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్ కు సంబంధించిన వార్తలు పెద్దఎత్తున వస్తూనే ఉన్నాయి.ఏదో ఒక కారణంతో కేసీఆర్ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.

TeluguStop.com - Ktr As Chief Minister Post Greater Elections

కేసిఆర్ ఢిల్లీ రాజకీయాలపై పట్టు సాధించాలని చూస్తున్నారు.జాతీయ స్థాయిలో యాక్టీవ్ అవ్వాలని చూస్తున్నారని, అందుకే కేటీఆర్ కు ఆ బాధ్యతలు అన్నిటిని అప్పగించి తన బాధ్యతలు నెరవేర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.

కెసిఆర్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తన హవా నడిపించే విధంగా చేసుకుంటూ వస్తున్నారు.కెసిఆర్ తర్వాత పార్టీలో నెంబర్ టూ గా ఉంటూ వచ్చిన హరీష్ రావును సైతం పక్కకు నెట్టి కేటీఆర్ సంపాదించుకున్నారు.

TeluguStop.com - కేటీఆర్ పట్టాభిషేకం ఎప్పుడంటే -Political-Telugu Tollywood Photo Image

ఇప్పుడు కేసీఆర్ అందుబాటులో ఉన్నా, లేకపోయినా, ఉన్నతాధికారులతో సమీక్ష, మంత్రులతో మీటింగులు కానీ అన్నిటినీ కేటీఆర్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ గట్టిగానే కష్టపడుతున్నారు.150 డివిజన్లలో వందకు పైగా స్థానాలను టిఆర్ఎస్ ఖాతాలో వేయాలనే పట్టుదలతో కేసీఆర్ ఆ బాధ్యతలు అన్నిటినీ కేటీఆర్ కు అప్పగించారు.2016 ఎన్నికల్లోనూ 99 స్థానాలను టిఆర్ఎస్ పార్టీ అంటే అదంతా కేటీఆర్ క్రెడిట్ అని కేసిఆర్ బలంగా నమ్ముతున్నారు.ప్రస్తుతం ఐటి మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న కేటీఆర్ గ్రేటర్లో గెలుపునకు కేటీఆర్ గట్టిగానే కష్ట పడుతున్నారు.అయితే చాలా చోట్ల పార్టీకి ఆశించిన స్థాయిలో ఆదరణ లేకపోవడం వంటి కారణాలతో కేటీఆర్ తీరికలేకుండా అన్ని లోటు పాట్లు సరిచేసుకుంటూ వస్తున్నారు.

ప్రజా సమస్యలపై నిత్యం అధికారులతో చర్చించి సమీక్షలు చేస్తూ, వాటిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.కొంతకాలంగా గ్రేటర్ పరిధిలో కేటీఆర్ హడావుడి చేస్తూ, వివిధ అభివృద్ధి పనులకు, శంకుస్థాపన లకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సైతం రంగంలోకి దింపి పార్టీ బలహీనంగా ఉన్నచోట దృష్టి పెడుతున్నారు.

ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలకు ప్రోత్సాహం ఇస్తున్నారు.గ్రేటర్ ఎన్నికల్లో వందకు పైగా డివిజన్ లను టిఆర్ఎస్ ఖాతాలో వేసేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.

గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ కు గట్టి విజయాన్ని అందించి తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చోవాలని కేటీఆర్ భావిస్తున్నారు.కేసీఆర్ సైతం ఇదే ఆలోచనతో ఉండడంతో, గ్రేటర్ ఎన్నికలు ముగియగానే కేటీఆర్ పట్టాభిషేకం జరిగే అవకాశం కనిపిస్తోంది.

#KTRSworn #Trs Party

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ktr As Chief Minister Post Greater Elections Related Telugu News,Photos/Pics,Images..