మొక్కలు బతక్కపోతే పదవులు ఊడతాయ్  

Kt Ramarao Warning To Municipal Councillors Over Tree Protection - Telugu Cm Kcr, Kt Ramarao, Municipal Councillors, Telangana Haritha Hāram, Tree Protection, కేటీఆర్, కేసీఆర్

తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఏ విషయంలోనూ రాజీ పడేలా కనిపించడం లేదు.అధికారులు, సొంత పార్టీ నాయకులు, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరినీ బెదిరింపు ధోరణితో హెచ్చరిస్తూ, తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Kt Ramarao Warning To Municipal Councillors Over Tree Protection

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు లేకపోయినా కెసిఆర్ మాత్రం నాలుగేళ్ల తర్వాత రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు.ముఖ్యంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

గతంలో మున్సిపాలిటీ అంటే చెడ్డపేరు ఉండేదని, అది పూర్తిగా తొలగిపోవాలని కెసిఆర్ పదే పదే పార్టీ శ్రేణులను, కొత్తగా ఎంపికైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు చెబుతున్నారు.

మొన్ననే ప్రగతి భవన్ లో సమావేశం పెట్టి మరీ క్లాస్ పీకారు కెసిఆర్.

ఈ వ్యవహారం ఇలా ఉంటే మంత్రి కేటీఆర్ కూడా అదే స్థాయిలో వార్నింగ్ ఇస్తున్నారు.పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలోని వార్డుల్లో మొక్కలను పెద్ద సంఖ్యలో నాటుతున్నారు.

ఇదంతా మంచి పరిణామమేనని, నాయకులు కేవలం ఫోటోలు కోసం మొక్కలు నాటి వదిలేస్తే ఊరుకునేది లేదని, నాటిన మొక్క లో 85% మొక్కలు బతికి తీరాలని, ఆ విధంగా చేయగలిగితేనే మొక్కలు నాటాలని, అలాగే మొక్కల బాధ్యతను పూర్తిగా కౌన్సిలర్లు తీసుకోవాలని, అవి బతక్కపోతే కౌన్సిలర్ల పదవులు ఊడగొట్టడం ఖాయమంటూ కేటీఆర్ వార్నింగ్ ఇస్తున్నారు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేసీఆర్, కేటీఆర్ వార్నింగ్ లు వరుస వరుసగా వార్ణింగ్స్ ఇస్తూనే ఉన్నారు.సక్రమంగా పని చేయకపోతే పదవులు ఊడపీకేస్తామంటూ పదే పదే బెదిరిస్తున్నారు.దీనిపై పార్టీలో నాయకుల మధ్య పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.

సొంత పార్టీ నాయకులను ఇలా బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ వారంతా ఆవేదన చెందుతున్నారు.ఇప్పుడు మొక్కలు మున్సిపాలిటీల్లో నాటిన మొక్కలు బతక్కపోతే కౌన్సిలర్ పదవులు ఊడపీకేస్తామంటూ బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అని, అసలే రాబోయేది వేసవి కాలం కనుక నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది అని, ఇప్పుడు ఈ మొక్కలు ఎలా బతికించుకోవాలో అంటూ మున్సిపల్ చైర్మన్ లు, కౌన్సిలర్ లు ఆందోళన చెందుతున్నారు.

తాజా వార్తలు