భారత మహిళ సారధ్యంలో నల్లజాతీయుల ఆందోళనలు..!!!

అమెరికాలో నల్లజాతీయులు జార్జ్ , బ్రూక్స్ హత్యల ఉదంతం అందరికి తెలిసిందే.వారిపై అమెరికా పోలీసులు చూపించిన ప్రతాపం, జాతి వివక్ష కారణంగా ఇరువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

 George Floyd Murder,protesters, Black Lives Matter,-TeluguStop.com

వారిని అత్యంత మానుషంగా చంపిన ఇద్దరు పోలీసులని అరెస్ట్ చేసినా కటినమైన శిక్షలు విధించాలని పట్టుబట్టారు నల్లజాతీయులు.నిన్నటి వరకూ హత్య తాలూకు పరిస్థితులపై స్పందించిన నిరసన కారులు ఇప్పుడు జాత్యహంకారంపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

అమెరికాలో వివిధ ప్రాంతాలలో నిరసన కారులు తమ నిరసనలు తెలిపుతున్నారు.ముఖ్యంగా సియాటిల్ లో జరుగుతున్నా వేలాది మంది నిరసన కారులు రోడ్లపైకి వచ్చి బ్లాక్ లైవ్ మ్యాటర్ పేరుతో చేస్తున్న నిరసనలు ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద చిక్కు తెచ్చి పెడుతున్నాయి.

ఇదిలాఉంటే వేలాది మందితో కూడి ఉన్న సియాటిల్ నిరసన కారులకు భారత సంతతి మహిళ సారధ్యం వహిస్తోంది.ఆమె నాయకత్వంలో ముందుకు వెళ్తున్న నిరసన కారులు ఆమె ఆదేశాల మేరకు నడుచుకుంటున్నట్టుగా ఓ కధనం ప్రచురితమయ్యింది.

ఆమె పేరు క్షమా సావంత్.పూణేలో పుట్టిన ఆమె చదువు మొత్తం ముంబై లో సాగింది.

ఆ తరువాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అమెరికాలో అవకాశం వచ్చి వెళ్ళిన ఆమె అక్కడి సమాజంలో అసమానతలు గుర్తించారు.సామాజిక మార్పులకి ఎంతో కృషి చేశారు.

ఆర్ధిక శాస్త్రం చదివి అందులో పీహెచ్డీ చేశారు.ప్రస్తుతం ఆందోళన కారులకి నాయకత్వం వహిస్తున్న ఆమె సియాటిల్ డౌన్ టౌన్ నుంచీ పోలీసులని తొలగించాలనే నినాదంతో నిరసన కారులకి నాయకత్వం వహిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube