నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాను తమిళ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాతో బాలయ్య-రవికుమార్ కాంబో హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.కాగా బాలయ్య సెట్స్‌పై ప్రవర్తించే తీరుపై రవికుమార్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
బాలయ్యకు కోపం ఎక్కువగా ఉంటుందని, సెట్స్‌పై అందరినీ తిడతారని, కొన్నిసార్లు చేయి కూడా చేసుకున్నారనే భావన చాలా మందిలో ఉంది.దీనికి తగ్గట్టుగా బాలయ్య అడపాదడపా చేయి చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
అయితే ఇదంతా ట్రాష్ అంటున్నారు కెఎస్ రవికుమార్.బాలయ్యతో రెండు సినిమాలు చేసిన అనుభవంలో ఆయన ఏనాడు ఇతరులను కోపడటం తాను చూడలేదంటున్నారు.
కేవలం బాలయ్య తన అసిస్టెంట్లు పని చేయకపోయినా, చెప్పిన పని సరిగా చేయకపోయినా కోపడతారు తప్పితే ఇతరులను ఎలాంటి మాటలు అనరు అంటూ రవికుమార్ చెప్పారు.
ఇక తన అసిస్టెంట్లను తిట్టినా, తరువాత వారితో కూల్‌గా ప్రవర్తించడం బాలయ్యకే చెందిందని రవికుమార్ ఆయన తరఫున వకాల్తా పుచ్చుకున్నారు.
ఏదేమైనా బాలయ్య ప్రవర్తనపై రవికుమార్ కామెంట్స్ నందమూరి ఫ్యాన్స్‌ను సంతోష పెట్టినా సాధారణ ఆడియెన్స్‌ను మాత్రం ఇంప్రెస్ చేయలేదు.మరి ఈ కామెంట్స్‌తో రూలర్ చిత్రంకు ఏదైనా ఒరుగుతుందో లేదో అనేది సినిమా రిలీజ్ అయితేనే చెప్పగలం.