తెరపైకి మరోసారి సిల్క్ స్మిత బయోపిక్

సౌత్ ఇండియా ఇండస్ట్రీలో సిల్క్ స్మిత పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.ఇండస్ట్రీలో ఒక దశలో ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఈ అందాల భామ, సినిమాలలో కూడా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలలో కనిపించి నటిగా కూడా ప్రూవ్ చేసుకుంది.

 Ks Manikandan To Make A Biopic Of Silk Smitha, Kollywood, Tollywood, Item Girl,-TeluguStop.com

హీరోయిన్స్ తో సమానంగా రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి సిల్క్ స్మిత చేరుకుంది.సినిమా మీద పిచ్చితో ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎవరూ ఊహించనంత ఎత్తుకి ఎదిగింది.

అయితే ఆమె సినిమా కెరియర్ ఉన్నంత అద్భుతంగా జీవితం లేదని చెప్పాలి.ప్రేమలో ఓడిపోయింది, నమ్మి మోసపోయింది.

అదే సమయంలో సినిమా నిర్మాణంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయింది.మానసికంగా క్రుంగిపోయి చివరికి ప్రాణాలు తీసుకుంది.35 ఏళ్ల వయస్సులోనే ఆమె తనువు చాలించింది.సిల్క్ స్మిత జీవిత కథతో విద్యా బాలన్ టైటిల్ రోల్ లో డర్టీ పిక్చర్ సినిమా వచ్చింది.

ఆ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.డర్టీ పిక్చర్ విద్యా బాలన్ ని కూడా బాలీవుడ్ లో స్టార్ ని చేసింది.

అయితే మరో సారి సిల్క్ స్మిత జీవిత కథని తెరపై ఆవిష్కరించడానికి ఓ తమిళ దర్శకుడు రెడీ అవుతున్నాడు.కేఎస్ మణికందన్ సిల్క్ స్మిత జీవిత కథతో సినిమా తీయడానికి సన్నాహలు చేస్తున్నాడు.

కమెడియన్ సంతానం తో ఫస్ట్ సినిమా చేసిన మణికందన్ తన రెండో ప్రాజెక్ట్ గా సిల్క్ స్మితను ఎంచుకున్నాడు.ఈ బయోపిక్ కి అవల్ అప్పడితన్ అనే పేరు కూడా పెట్టేశాడు.

మణికందన్ సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆమెలోని ఆ హాట్ నెస్ ను మ్యాచ్ చేసే వాళ్లు ఎవ్వరూ పుట్టలేదు.ఆమె పాత్రకు న్యాయం చేసే నటి కోసం మేమంతా వెతుకుతున్నామని చెప్పుకొచ్చాడు.

మరి సిల్క్ స్మిత పాత్రలో నటించబోయే హీరోయిన్ ఎవరై ఉంటారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube