ఇండియన్ సూపర్ మెన్ సిరీస్ క్రిష్ 4లో ఛాన్స్ కొట్టేసిన కృతి సనన్  

Kruti Sanon opposite Hrutik in Krrish sequel, Rakesh Roshan, Hrutik Roshan, Pan India Movie, Indian Super Hero - Telugu Hrutik Roshan, Indian Super Hero, Kruti Sanon Opposite Hrutik In Krrish Sequel, Pan India Movie, Rakesh Roshan

కెరియర్ ఆరంభంలో టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నేనొక్కడినే, చైతన్య దోచేయ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన బాలీవుడ్ భామ కృతి సనన్.ఆ సినిమా తర్వాత అమ్మడు పూర్తిగా బాలీవుడ్ కి పరిమితం అయిపొయింది.

TeluguStop.com - Kruti Sanon Opposite Hrutik In Krrish Sequel 4

Source:TeluguStop.com

అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ స్పీడ్ పెంచింది.మరో వైపు కొంత కాలం సుశాంత్ తో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది.

TeluguStop.com - ఇండియన్ సూపర్ మెన్ సిరీస్ క్రిష్ 4లో ఛాన్స్ కొట్టేసిన కృతి సనన్-Movie-Telugu Tollywood Photo Image

అలాగే అప్పుడప్పుడు కొన్ని వివాదాలతో కూడా అందరి దృష్టి తనవైపు పడేలా ఈ అమ్మడు చేసుకుంది.ఏ విషయం మీద అయిన బోల్డ్ గా మాట్లాడటం కృతి సనన్ స్టైల్.

దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ లో అప్పుడప్పుడు తన కామెంట్స్ తో కూడా ఫోకస్ అవుతుంది.ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ లో ఈ అమ్మడు మరో క్రేజీ ఆఫర్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

హృతిక్ రోషన్ హీరోగా రూపొందే ఇండియన్ సూపర్ మెన్ సిరీస్ లో నాలుగో చిత్రంగా వస్తున్న క్రిష్ 4 చిత్రంలో కథానాయికగా కృతి సనన్ కి అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.ముందుగా ఈ రోల్ కోసం కత్రినా కైఫ్, అలియా భట్ లాంటి స్టార్ హీరోయిన్స్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం కృతి సనన్ తో సినిమా అగ్రిమెంట్ కూడా జరిగిపోయిందని తెలుస్తుంది.క్రిష్ 4 సినిమా అంటే ఈ సారి పాన్ ఇండియా రేంజ్ లో దీనిని ఆవిష్కరించడానికి రాకేశ్ రోషన్ సిద్ధం అవుతున్నాడు.

ఈ నేపధ్యంలో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచే విధంగా అద్బుతమైన కథని సిద్ధం చేశారు.ఇక ఇందులో నాలుగు పాత్రలలో హృతిక్ కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది.

భారీ క్రేజ్ ఉన్న ఇలాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కృతి సనన్ హీరోయిన్ గా ఎంపిక కావడం నిజంగా అదృష్టం అని చెప్పాలి.

#Pan India Movie #KrutiSanon #Rakesh Roshan #Hrutik Roshan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kruti Sanon Opposite Hrutik In Krrish Sequel 4 Related Telugu News,Photos/Pics,Images..