ఏంటి కృనాల్ పాండ్యా... నువ్విక మారవా అంటున్న ఫ్యాన్స్... అసలేమైందంటే?

భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ మరే ఆటకు లేదన్న విషయం తెలిసిందే.అన్ని దేశాల్లో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే, కాని మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా పూజించేంత వెర్రి అభిమానం కలిగి ఉంటాం.

 Krunal Pandya Throws Moisturizer Bottle On The Face Of Anukul Roy-TeluguStop.com

అందుకే మన దేశంలో రోజురోజుకు క్రికెట్ కు ఆదరణ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.అంతర్జాతీయ క్రికెట్ లో సత్తా చాటాలని చాలా మంది కోరుకుంటుంటారు.

కాని కొద్ది మందికే అది సాధ్యమవుతుంది.ఇక ఒక్కసారి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడితే కోట్లాది మంది అభిమానులు సదరు ఆటగాడి ఆట తీరును, నడవడికను ఇలా అన్ని విషయాలను అనుసరిస్తుంటారు.

 Krunal Pandya Throws Moisturizer Bottle On The Face Of Anukul Roy-ఏంటి కృనాల్ పాండ్యా… నువ్విక మారవా అంటున్న ఫ్యాన్స్… అసలేమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఎంత గొప్ప ఆటగాడివైనా నీ నడవడిక, ఇతర ఆటగాళ్లతో ప్రవర్తించే విధానం బాగా లేకుంటే ఉన్న గౌరవం కాస్తా పోయి అభిమానుల ఆగ్రహానికి బలి కావలసి ఉంటుంది.నువ్వు గొప్ప ఆటగాడివైనా, నీ నడవడిక సరిగ్గా ఉంటే ప్రపంచంలో క్రికెట్ చరిత్రలో నీ గౌరవం మరింత పెరుగుతుంది.

తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కృనాల్ పాండ్యా తోటి క్రికెటర్ తో ప్రవర్తించిన విధానం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.క్రీజ్ లో పరుగు తీసే క్రమంలో చేతి వేలికి కొంచెం గీసుకపోవడంతోస్టాండ్స్ నుండి అనుకుల్ రాయ్ మాయిశ్చరైజర్ ను అందించడానికి రాగా, ఇక అంతా అయిపోయాక చేతికి ఇవ్వకుండా మొఖానికి విసిరి కొట్టి వెళ్లిపోయాడు.

ఇక కృనాల్ ప్రవర్తించిన తీరుపై నెట్టింట్లో ఆగ్రహం వ్యక్తమావుతోంది.నువ్విక మారవా పాండ్యా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#Anukul Roy #Viral Video #Netizens Angry ##Dream11IPL #@MumbaiIndians

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు