ఐపీఎల్ చరిత్ర లోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్న కృనాల్...!

ఐపీఎల్ 13వ సీజన్ జోరుగా కొనసాగుతోంది.పాయింట్ల పట్టికలో మొదటి స్థానం నీదా నాదా అన్నట్లుగా ఐపీఎల్ లోని జట్లు పోటీపడుతున్నాయి.

 Krunal Pandya Holds The Rare Record In Ipl History  Mumbai Indians, Sun Risers H-TeluguStop.com

ఇక తాజాగా జరిగిన ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ రికార్డ్ నమోదయింది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.

ఇక ఇంత భారీ స్కోర్ సాధించడంలో భాగంగా చివర్లో బ్యాటింగ్ చేసిన కృనాల్ పాండ్యా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ హైదరాబాద్ జట్టుపై 34 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

ఇకపోతే మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు చివరి ఓవర్లో రెండో బంతికి హార్దిక్ పాండ్యా అవుట్ అవ్వగా బ్యాటింగ్ చేయడానికి కృనాల్ పాండ్యా క్రీజ్ లోకి వచ్చాడు.అలా వచ్చి రాగానే మిగిలిన నాలుగు బంతులను బౌండరీలు బాది కొత్త రికార్డులను తన పేరున సృష్టించుకున్నాడు.

తాను ఎదుర్కొన్న మొదటి బంతిని నేరుగా బౌండరీ లైన్ అవతల పడేలా సిక్స్ కొట్టాడు.ఆ తర్వాత రెండు బంతులను ఫోర్స్ గా మలిచాడు.ఇక చివరి బంతిని కూడా సిక్స్ ను బాది ఇన్నింగ్స్ ను ముగించాడు.

ఈ నేపథ్యంలోనే కేవలం 4 బంతులను ఎదుర్కొన్న పాండ్య 20 పరుగులను రాబట్టాడు.

దీంతో అతని స్ట్రైక్ రేట్ 500 గా నమోదయింది.దీంతో ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 500 స్ట్రైక్ రేటుతో నాటౌట్ గా నిలిచిన వ్యక్తి గా కృనాల్ పాండ్యా కొత్త చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్ చరిత్రలో కనీసం 10 పరుగులు చేసిన వ్యక్తులలో 500 స్ట్రైక్ రేట్ కలిగిన వ్యక్తిగా కృనాల్ పాండ్యా రికార్డు సృష్టించాడు.తాజాగా జరిగిన మ్యాచ్ లో ట్రెంట్ బౌల్ట్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube