మహేష్ బాబు అమ్మాయిలా ఉన్నాడు, అతని సినిమాలు చూడను అంటున్నాడు     2017-09-15   02:20:47  IST  Raghu V

బాలివుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ కి ఏ చిన్న విషయం దొరికినా, దాన్ని వివాదం చేసి తన పబ్లిసిటి కోసం వాడుకోవడం బలపంతో పెట్టన విద్య. ఎవరిని వదలదు. మరీ ముఖ్యంగా దక్షిణాది నటులని, నటీమణులను అస్సలు వదలదు. ఎదో ఒక మాట అనడం, ఆ తరువాత తన పోస్టుల కింద వచ్చే బూతులని ఎంజాయ్ చేయడం. కమాల్ ఆర్ ఖాన్ ఎప్పుడూ చేసే పని ఇదే. పవన్ కళ్యాణ్ కి జోకర్ అన్నాడు, అలాంటి హీరో బాలివుడ్ లో సైడ్ క్యారక్టర్స్ కి కూడా పనికి రాడు అన్నాడు. అల్లు అర్జున్ చెత్తగా కనిపిస్తాడు, సౌత్ లో హీరో ఎలా అయ్యాడో అర్థం కాదు అన్నాడు. సమంతని కూడా వదలలేదు. దీపిక పడుకోనే పక్కన సైడ్ క్యారక్టర్ కూడా ఎక్కువే అన్నాడు. ఇక మహేష్ బాబు గురించి కామెంట్ చేస్తూ, ఇప్పటికే మహేష్ బాబు హీరోయిన్ లా ఉంటాడు అని అనేసిన కేఆర్కే, మరోసారి అదే మాటతో ప్రిన్స్ ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీసాడు.

రాత్రి స్పైడర్ ట్రైలర్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్ మీద కామెంట్ చేసిన కమాల్ ఆర్ ఖాన్ ఈ ట్రైలర్ చాలా చెత్తగా ఉంది, ఇలాంటి సినిమాలు దక్షిణాది వారు చూస్తారేమో కాని, బాలివుడ్ వారు ఎప్పటికి చూడరు. మహేష్ బాబు హీరోయిన్ లా ఉన్నాడు, నేను అతనికి అభిమానిని కాలేను అంటూ చేతికి ఎంతోస్తే అంత ట్వీట్ చేసేసాడు.

కేఆర్కే ఇలా ట్వీట్ చేయడం ఇది కొత్తేమి కాదు. ప్రతిరోజు బూతులు తిననిదే, వివాదాలతో పబ్లిసిటి పొందనిదే, అతనికి పొద్దు గడవదు. కాబట్టి ఇవన్ని లైట్ గా తీసుకొని దసరా సందడి కోసం, పండక్కి వచ్చే స్పైడర్, జై లవ కుశ కోసం వెయిట్ చేస్తే బెటర్.