ఆసిన్, అనుపమ దారిలోనే వెళ్తున్న కృతి శెట్టి

Kriti Shetty Is In Her Way Of Asin And Anupama

కృతి శెట్టి. టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

 Kriti Shetty Is In Her Way Of Asin And Anupama-TeluguStop.com

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు.తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

డ్రీమ్ డెబ్యూగా ఉప్పెన సినిమా నిలిచింది.ఈ సినిమా సక్సెస్ తర్వాత కృతి శెట్టికి వరుస అవకాశాలు వచ్చాయి.

 Kriti Shetty Is In Her Way Of Asin And Anupama-ఆసిన్, అనుపమ దారిలోనే వెళ్తున్న కృతి శెట్టి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రెండు సినిమాగా శ్యామ్ సింగ రాయ్ చేసింది.ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంది.

ఆ సినిమా తర్వాత మరో సినిమాలో అవకాశాన్ని అందుకుంది.అది మరేదో కాదు.

బంగార్రాజు.ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది.

నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో నాగ చైతన్య కు జంటగా నటిస్తోంది.ఈ సినిమాలో కృతి శెట్టి సర్పంచ్ నాగ లక్ష్మిగా కనిపిస్తుంది.

తాజాగా ఈ సినిమా జనాలను అలరిస్తోంది.

అటు ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన తొలి ఏడాదిలోనే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు.

సంక్రాంతి బరిలో నిలిచి మూడో విజయాన్ని అందుకున్నారు.వారే అసిన్, అనుపమ పరమేశ్వర్.2003లో అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత నాగార్జునతో కలిసి శివమణి సినిమా చేసి మరో విజయాన్ని అందుకుంది.అనంతరం 2004లో సంక్రాంతికి వచ్చిన లక్ష్మీ నరసింహతో హ్యాట్రిక్ అందుకుంది.

Telugu Bangarraju, Hat Trick, Asin, Krithi Shetty, Kriti Shetty, Naga Chaitanya, Nagarjuna, Tollywood, Uppena-Movie

అటు అనుపమ పరమేశ్వర్ సైతం అ ఆ సినిమాతో 2016లో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.2016లో రెండు వరుస విజయాలు అందుకుంది.2017 సంక్రాంతికి వచ్చిన శతమానం భవితి సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది.

Telugu Bangarraju, Hat Trick, Asin, Krithi Shetty, Kriti Shetty, Naga Chaitanya, Nagarjuna, Tollywood, Uppena-Movie

టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న అసిన్, అనుపమ పరమేశ్వర్ బాటలోనే కృతి శెట్టి కూడా నడుస్తుందేమో చూడాలి.తాజాగా విడుదల కానున్న బంగార్రాజు హిట్ కొడితే వారి సరసన కృతి శెట్టి చేరనుంది.హ్యాట్రిక్ కొట్టిన మూడో హీరోయిన్ గా నిలువనుంది.

#Trick #Bangarraju #Uppena #Naga Chaitanya #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube