బేబమ్మ ఇప్పుడే వచ్చి అప్పుడే అర కోటి తీసుకుంటోందా...?

మామూలుగా సినిమా పరిశ్రమలో కొందరు నటీనటులు ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఓవర్ నైట్ లో స్టార్ అయిపోతుంటారు.కాగా ఇటీవలే నూతన దర్శకుడు బుచ్చి బాబు సాన దర్శకత్వం వహించిన  ఉప్పెన  చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “కృతి శెట్టి” కూడా ఈ కోవకే చెందుతుంది.

 Kriti Shetty Is Charging 60 Lakh Rupees For Ram Pothineni Movie-TeluguStop.com

ఈ చిత్రంలో కృతి శెట్టి  బేబమ్మ అనే యువతి పాత్రలో నటించడంతో అందరూ ఏకంగా బేబమ్మ అని ముద్దుగా పిలుస్తున్నారు. అయితే  కృతి శెట్టివచ్చి రావడంతోనే బాక్సాఫీస్ వద్ద మంచి హిట్  అందుకోవడంతో ప్రస్తుతం ఈ అమ్మడికి  సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

అయితే తాజాగా కృతి శెట్టిగురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇంతకీ  ఆ వార్త ఏమిటంటే ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

 Kriti Shetty Is Charging 60 Lakh Rupees For Ram Pothineni Movie-బేబమ్మ ఇప్పుడే వచ్చి అప్పుడే అర కోటి తీసుకుంటోందా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 అయితే ఈ చిత్రంలో నటించేందుకు కృతి శెట్టి  దాదాపుగా 60 లక్షల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.కాగా ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్నాడు.

దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. అంతేగాక బేబమ్మ ఇప్పుడే వచ్చి అప్పుడే అర కోటికి పైగా పారితోషికం తీసుకుంటోందంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

 ఈ విషయంలో ఇలా ఉండగా ప్రస్తుతం కృతి శెట్టి ఉప్పెన చిత్ర హిట్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది.అలాగే తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న “శ్యామ్ సింగరాయ్”  అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు.ఇటీవల హీరో నాని పుట్టినరోజు కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

అయితే ఓ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మరిఓ తెలుగు చిత్రంలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం…

.

#Kriti Shetty #KritiShetty #KritiShetty #RamPothineni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు