కృతి సనన్ స్వయంవరం.. ఆ ముగ్గురు హీరోలు ఖచ్చితంగా ఉండాల్సిందేనట!

బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కృతి సనన్ కి ప్రస్తుతం అదృష్టం వరించినట్టుంది.

 Kriti Sanon Wants Vijay Devarakonda In Her Swayamvar And Other Two Stars Details, Kriti Sanon, Tollywood, Swayamvar, Aadi Purush, Prabhas, Vijay Devarakonda, Adithya Roi Kapoor, Karthik Aryan-TeluguStop.com

అందుకే ఈ మధ్యకాలంలో కృతి ఎటువంటి సినిమాలు చేసినా కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకుంటున్నాయి.ఇక మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా అనుకున్న విధంగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సాధించకపోయినా కూడా హీరోయిన్ కృతి సనన్ అన్నకు మాత్రం మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది.ఆ తర్వాత ఈమెకు తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో వెంటనే బాలీవుడ్ కి చెక్కేసింది.

 Kriti Sanon Wants Vijay Devarakonda In Her Swayamvar And Other Two Stars Details, Kriti Sanon, Tollywood, Swayamvar, Aadi Purush, Prabhas, Vijay Devarakonda, Adithya Roi Kapoor, Karthik Aryan-కృతి సనన్ స్వయంవరం.. ఆ ముగ్గురు హీరోలు ఖచ్చితంగా ఉండాల్సిందేనట-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్కడ అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.అయితే బాలీవుడ్ లో మొదట గ్లామరస్ పాత్రలు చేయకుండా పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం ఆమె కెరీర్ కు చాలా ఉపయోగపడింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కృతి సనన్ టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అలాగే ఈ సినిమా అయిన తర్వాత కృతి సనన్ క్రేజ్ మరొక రేంజ్ కి వెళ్తుంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Aadi Purush, Karthik Aryan, Kriti Sanon, Prabhas, Swayamvar, Tollywood-Latest News - Telugu

ఒక వైపు సినిమాలో నటిస్తూనే అప్పుడప్పుడు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉంటుంది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన స్వయంవరం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.తన స్వయంవరం గురించి మాట్లాడుతూ ఒకవేళ తన స్వయంవరం కనుక పెడితే అందులో తప్పకుండా ముగ్గురు హీరోలు ఉండాలి అని ఆమె తెలిపింది.

మరి ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో పాటు మరొక ఇద్దరు హీరోలు కూడా రావాల్సిందే అని తెలిపింది.మరొక హీరో కార్తీక్ ఆర్యన్ కాగా, మరో హీరో ఆదిత్య రాయ్ కపూర్ కూడా తన స్వయంవరంలో పాల్గొనాలి అని తెలిపింది.

Telugu Aadi Purush, Karthik Aryan, Kriti Sanon, Prabhas, Swayamvar, Tollywood-Latest News - Telugu

అయితే వీరిద్దరి స్టైల్ బాగుంటుందని వారి ఆటిట్యూడ్ కూడా తనకు బాగా నచ్చుతుంది అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.అలాగే విజయ్ దేవరకొండ తన స్వయంవరంలో ఎందుకు ఉండాలి అన్న విషయం పై కూడా క్లారిటీ ఇచ్చింది.విజయ్ దేవరకొండ లుక్స్ బాగుంటాయని, అతని మాట్లాడే విధానం అద్భుతంగా ఉంటుందని, విజయలో సున్నితత్వం కూడా ఉందని అందుకే స్వయంవరం నిర్వహిస్తే అటువంటి వ్యక్తి తప్పకుండా ఉండాలి అని తన మనసులోని మాటను బయట పెట్టింది కృతి సనన్.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube