తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ కృతి సనన్.ఈ అమ్మడు హీరోయిన్ గా బాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది.
యంగ్ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా మారిపోయింది.కృతి సనన్ గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న కూడా మహిళల హక్కుల కోసం, సమాజంలో ఆడవాళ్ళపై జరుగుతున్న వేధింపులపై సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు రియాక్ట్ అవుతుంది.
తన అభిప్రాయాలని పంచుకుంటుంది.బాలీవుడ్ మీటూ ఉద్యమం జరిగిన సమయంలో కూడా కృతి సనన్ తన వాక్కు వినిపించింది.
అయితే సుశాంత్ ఇష్యూలో ఆమెని చాలా మంది బ్లేమ్ చేశారు.ఏది ఏమైనా తన అభిప్రాయాలని నిర్మొహమాటంగా చెప్పడంలో ముందుండే కృతి సనన్ ఇప్పుడు ఓ సోషల్ అవేర్ నెస్ ప్రోగ్రాం లో భాగం అవుతుంది.జాతీయ మహిళా కమిషన్ త్వరలో నిర్వహించబోతున్న ఓ కార్యక్రమం గురించి కృతి ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. “మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా భారత్” అనే ఆన్లైన్ చర్చా కార్యక్రమాన్ని జాతీయ మహిళా కమిషన్ మూడ్రోజుల పాటు నిర్వహిస్తోంది.
ఈ నెల 25 నుంచి 27 వరకు ఈ కార్యక్రమం జరుగనుంది.మహిళలు, అమ్మాయిలు ఈ కార్యక్రమంలో పాల్గొనండి.అందరూ రిజిస్టర్ చేసుకోవాలని కృతి సూచించింది.మొత్తానికి కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని ప్రచారాలు చేసే హీరోయిన్లుకి దూరంగా ఈ భామ పైసా కూడా ఆశించకుండా మహిళల పై జరుగుతున్న వేధింపులపై ప్రచారం చేస్తూ టీనేజ్ అమ్మాయిలలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం నిజంగా గొప్ప విషయం.