ఎలాంటి డ్రీమ్స్ లేకుండానే నటిని అయ్యా అంటున్న కృతి సనన్

చాలా మంది అందాల భామలు వెండితెరపై స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాలనే కలలతో అడుగుపెడతారు.ఇలా వచ్చిన వారిలో కొంత మంది మంచి అవకాశాలని అందిపుచ్చుకొని తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంటారు.

 Kriti Sanon Reflects On Seven Years Journey In Bollywood, Tollywood, Adi Purush,-TeluguStop.com

కొంత మంది మంచి నటిగా ప్రూవ్ చేసుకుంటారు.మరికొందరు స్టార్ హీరోయిన్స్ గా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదుగుతారు.

అయితే కొంత మంది హీరోయిన్స్ మాత్రం యాద్రుస్చికంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్స్ అయిపోతారు.నటిగా కెరియర్ స్టార్ట్ చేసాక వారి అందం, దానికి తగ్గట్లు నటనలో తమని తాము ప్రూవ్ చేసుకునే విధానం వారిని టాప్ చైర్ లో కూర్చోబెడుతుంది.

అలా వచ్చి బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి కృతి సనన్.
ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏడేళ్ళు అవుతుంది.

ఈ ఏడేళ్ళ సినీ ప్రయాణం గురించి తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికర విషయాలు పంచుకుంది.నేను నటిని అవుతానని ఎప్పుడు ఊహించలేదు.

ఇది నా డ్రీం కూడా కాదు.అనుకోకుండా పరిశ్రమలోకి వచ్చాను.

ఎందుకంటే మాది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం.ఇందులోకి వచ్చాకే యాక్టింగ్‌ నన్ను ఎంతగా ఆకట్టుకుందో అర్ధమైంది.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలోకి వచ్చిన తనకు కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురైనట్లు కృతి వెల్లడించింది.సినిమా ఈవెంట్స్ ఎప్పుడూ కూడా ఒంటరిగా కూర్చునేదాన్ని, నాకు పెద్దగా స్నేహితులు కూడా లేవు.

అందుకే కొన్ని సమయాల్లో ఒంటరిని అనే ఫీల్ అయ్యేదాన్ని.ఈ విషయంలో కొంతబాధగా ఉండేది.

హీరోయిన్ గా ఈ స్థాయికి రావడానికి నేను ఎన్నో అపజయాలు, అవమానాలు ఎదుర్కొన్నా అని ఇన్స్టాగ్రామ్ స్టొరీలో కృతి సనన్ రాసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube