సుశాంత్ మరణంపై స్పందించిన ఆది పురుష్ సీత

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే.చేతినిండా సినిమాలు ఉండి మంచి టాలెంటెడ్ హీరోగా దూసుకుపోతున్న నటుడు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం అనేది అర్ధం కాని మిస్టరీగా మిగిలిపోయింది.

 Kriti Sanon React On Sushant Singh Death, Tollywood, Bollwood, Rhea Chakraborty,-TeluguStop.com

అయితే కెరియర్ పరంగా సుశాంత్ సక్సెస్ ఫుల్ జర్నీ సాగిస్తున్న వ్యక్తిగత జీవితంలో మాత్రం అతనికి అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతూ ఉండటంతో, మానసికంగా భాగా కృంగిపోయినట్లు తెలుస్తుంది.అతను ప్రేమించిన మొదటి అమ్మాయి బ్రేక్ అప్ చెప్పడం, తరువాత కృతి సనన్ తో కొంతకాలం రిలేషన్ లో ఉండగా ఆమె కూడా బ్రేక్ అప్ చెప్పేసి వెళ్ళిపోయింది.

ఆ తరువాత రియా చక్రవర్తి సుశాంత్ లైఫ్ లోకి వచ్చింది.ఆమె కూడా లాక్ డౌన్ టైంలో అతనికి బ్రేక్ అప్ చెప్పేసి వెళ్ళిపోయింది.

దీంతో ఒంటరితనం తట్టుకోలేక, వాటినుంచి బయటపడలేక డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు అనేది చాలా మంది మాట.ఇక సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో నెపోటిజం మీద పెద్ద చర్చే నడిచింది.అలాగే రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో ఇరుక్కొని ఇప్పటికి ఇబ్బందులు పడుతుంది.ఇప్పటికి ఆ విషాదం చాలా మంది జీవితాలని వెంటాడుతుంది.

ఇదిలా ఉంటే సుశాంత్ మాజీ ప్రియురాలు కృతి సనన్ అతని మరణంపై ఆ సమయంలో పెద్దగా స్పందించలేదు.అయితే చాలా కాలం తర్వాత తాజాగా ఆమె సుశాంత్ మరణంపై స్పందించింది.

గత ఏడాది నా జీవితంలో చాలా చేదు అనుభవాలను మిగిల్చి వెళ్లింది.సుశాంత్ మరణం తర్వాత నా మానసిక పరిస్థితి అస్సలు బాగాలేదు.

సుశాంత్ మరణం గురించి స్పందిస్తే కొందరు పాజిటివ్ గా మరి కొందరు నెగటివ్ గా స్పందిస్తున్నారు.అందుకే తాను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను.

సుశాంత్ గురించి జరుగుతున్న నెగటివ్ ప్రచారంలో తాను భాగం కావద్దనే ఉద్దేశ్యంతో నేను స్పందించలేదు అంది.ప్రస్తుతం ఈమె ప్రభాస్ మూవీ ఆదిపురుష్ లో సీత పాత్రను చేస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube