సుశాంత్ మరణంపై కృతి సనన్ ఎమోషనల్ కామెంట్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడడం బాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి అందరికి తెలిసిందే.కేవలం ఇండస్ట్రీలో వారసత్వం మాటున అతనికి అవకాశాలు రాకుండా తోక్కేయడం వలనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే మాట బలంగా వినిపిస్తుంది.

 Kriti Sanon Pens Emotional Post For Sushant, Tollywood, Bollywood, South Cinema,-TeluguStop.com

ఈ నేపధ్యంలో చాలా మంది దర్శకులు, నటులు బాలీవుడ్ లో వారసత్వం, కొంత మంది పెత్తనంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.సుశాంత్ వారసత్వ నటుల వలన తాము ఎలా అవకాశాలు కోల్పోతుంది కొంత మంది నటులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే సుశాంత్ మరణ వార్త విన్న తర్వాత ఆయన మాజీ ప్రేయసి హీరోయిన్ కృతి సనన్ తీవ్ర విచారంలోకి వెళ్ళిపోయింది.

తాజాగా ఆ విచారం నుంచి బయటకి వచ్చిన ఆమె సుశాంత్ ఆత్మహత్యపై స్పందిస్తూ పోస్ట్ చేసింది.

నీకున్న అద్భుతమైన మేధస్సు నీ నేస్తం, నీ బద్ధ శత్రువు కూడా.బతకడం కంటే చచ్చిపోవడమే మేలు అనుకునేలా నీ జీవితంలో కొన్ని క్షణాలు ఉన్నాయని తెలియడం కలచివేస్తోంది.

నీలోని గాయాన్ని నేను నయం చేయాల్సింది.కానీ అలా చేయలేకపోయాను.

ఇప్పుడు నా హృదయంలో ఓ భాగం నీతోనే వెళ్లిపోయింది.మరో భాగంలో నువ్వెప్పుడూ సజీవంగానే ఉంటావు.

నీ సంతోషం కోసం ప్రార్థించడం ఎప్పటికీ ఆపను.ఆపలేను కూడా అంటూ తీవ్ర భావోద్వేగాలతో ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

ఈ పోస్ట్ చూసిన తర్వాత కృతి సనన్ సుశాంత్ ని ఎంతగా ఇష్టపడింది అనే విషయం తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube