ఆ సినిమా లీక్ అయ్యి మంచే జరిగింది

కొన్ని సార్లు మనకు జరిగే నష్టం వల్ల ఆ తర్వాత తర్వాత మంచి జరుగుతుంది.ఏదైనా తప్పు జరిగి వెంటనే నష్టం జరిగినా ఆ తర్వాత దాని వల్లే లాభం కూడా జరిగే అవకాశాలు కొన్ని సార్లు ఉంటాయి.

 Kriti Sanon Mimi Movie Gets Good Response,latest Tollywood News-TeluguStop.com

అలా సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు జరుగుతూ ఉంటుంది.బాలీవుడ్ మూవీ మీమీ ఇటీవల ఆన్‌ లైన్ ద్వార మొత్తం లీక్ అయ్యింది.

నెట్‌ ఫ్లిక్స్ లో ఈనెల 30న విడుదల కావాల్సి ఉండగా అనూహ్యంగా హెచ్‌డీ ప్రింట్‌ బయటకు వచ్చేసింది.చిత్ర యూనిట్‌ సభ్యులు లీక్ పై చాలా ఆవేదన వ్యక్తం చేశారు.

నెట్‌ ఫ్లిక్స్ వారు కూడా సినిమా లీక్ విషయమై చాలా సీరియస్ అయ్యి పోలీసుల వరకు వెళ్లారు.కాని మీమీ లీక్ అవ్వడం వల్ల మంచే జరిగింది అంటే ఇప్పుడు కొందరు అంటున్నారు.

Telugu @netflixindia, Bollywood, Kriti Sanon, Mimi, Telugu-Movie

సినిమా లీక్ అయిన వెంటనే ఆ లింక్స్ ను తొలగించేశారు.కాని అప్పటికే చాలా మంది వద్దకు మీమీ వెళ్లి పోయిందనే ఉద్దేశ్యంతో చేసేది లేక వెంటనే రాత్రికి రాత్రి స్ట్రీమింగ్‌ మొదలు పెట్టారు.సినిమా లీక్ అయిన విషయం దేశ వ్యాప్తంగా మీడియాలో మారు మ్రోగింది.వెబ్‌ మీడియా నుండి సోషల్‌ మీడియా వరకు అన్ని చోట్ల మీమీ లీక్ గురించి ప్రచారం జరిగింది.

తెలుగు లో అసలు మీమీ సినిమా గురించి ఎవరికి కూడా పెద్దగా అవగాహణ లేదు.కాని ఎప్పుడైతే మీమీ లీక్ అయ్యిందని వార్తలు వచ్చాయో తెలుగు మీడియా కూడా ఆ వార్తలను ప్రచారం చేసింది.

దాంతో అన్ని చోట్ల కూడా సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కి ఎక్కువ మంది చూసే అవకాశం దక్కింది.సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 30న విడుదల చేసి ఉంటే మొత్తం ఎంత మంది చూసే వారో తెలియదు కాని ఒక్క రోజులోనే అంతకు మించిన వ్యూస్‌ వచ్చాయంటున్నారు.

లీక్ అయిన సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు.నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అయిన వెంటనే అందులో స్ట్రీమ్ చేసేందుకు పోటీ పడ్డారు.మొత్తానికి సినిమా లీక్‌ అయినా కూడా మంచే జరిగింది అనేది వారి వాదన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube