అనుష్కను ఫాలో అవుతున్న మహేష్ బ్యూటీ.. పాపం అమ్మడి పని అంతేనా?  

Kriti Sanon Following Anushka To Gain Weight For A Movie - Telugu Anushka, Kriti Sanon, Mimi, Size Zero, Telugu Movie News, Weight

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క ఫుల్ ఫాంలో ఉన్నప్పుడు ఓ పెద్ద తప్పు చేశానంటూ పలుసార్లు మీడియా ముందు వాపోయిన సంగతి తెలిసిందే.నాజుగ్గా ఉన్న అనుష్క దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కొడుకు సూర్యప్రకాష్ డైరెక్షన్‌లో ‘సైజ్ జీరో’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Kriti Sanon Following Anushka To Gain Weight For A Movie

ఆ సినిమా కోసం అనుష్క ఎంతలా లావుగా మారిందో అందరికీ తెలిసిందే.అయితే ఆ ఒక్క తప్పు వల్ల అనుష్క ఇప్పటికీ సన్నగా కాలేకపోతుంది.

ఇప్పడు అనుష్క బాటలో మరో బ్యూటీ కూడా అదే తప్పు చేస్తోంది.టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కృతి సనాన్, ఆ తరువాత బాలీవుడ్‌ చెక్కేసి అక్కడ మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్‌గా తన సత్తా చుటుతోంది.

అనుష్కను ఫాలో అవుతున్న మహేష్ బ్యూటీ.. పాపం అమ్మడి పని అంతేనా-Gossips-Telugu Tollywood Photo Image

ఇప్పటికే అనేక సినిమాల్లో నటించి కృతి ఇప్పుడు తాజాగా ‘మిమి’ అనే సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది.ఈ సినిమాలో అమ్మడు ఏకంగా 70 కిలోల బరువుతో మనకు కనిపిస్తుందట.

దీని కోసం ఆమె ఏకంగా 15 కిలోల బరువు పెరిగినట్లు తెలుస్తోంది.గతంలో అనుష్క చేసిన ప్రయోగంతో ఇప్పుడు ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిందే.

మరి ఈ బాలీవుడ్ పాప ఇంత బరువును మళ్లీ ఎలా తగ్గించుకుంటుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kriti Sanon Following Anushka To Gain Weight For A Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test