ఆ స్టార్ హీరోయిన్ తో డేటింగ్ చేసిన సుశాంత్?  

Hero Sushanth Singh Rajput Love Affair With kriti Sanon, kriti sanon, dating, sushant singh rajput, Love affair, Suicide Case - Telugu Dating, Hero Sushanth Singh Rajput Love Affair With Kriti Sanon, Kriti Sanon, Love Affair, Suicide Case, Sushant Singh Rajput

బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఆత్మహత్య కేసు ఎన్నో మలుపులు తిప్పుతోంది.తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

TeluguStop.com - Kriti Sanon Dated Sushant Singh Rajput

తీగ లాగితే డొంకంతా కదులుతోంది.సుశాంత్ ఆత్మహత్య కేసు ఎంతో మంది అరెస్ట్ లకు కారణమవుతోంది.

సుశాంత్ ది ఆత్మహత్యా…? హత్యా…? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.ఏ కేసులోనైనా విచారణ జరిపే కొద్దీ సమస్య పరిష్కారం అవుతుంది.

TeluguStop.com - ఆ స్టార్ హీరోయిన్ తో డేటింగ్ చేసిన సుశాంత్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ కేసులో మాత్రం భిన్నంగా విచారణ జరిపే కొద్దీ వెలుగులోకి వస్తున్న విషయాలు సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి.సుశాంత్ మృతి తరువాత డ్రగ్స్ దందా వెలుగులోకి రాగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ డ్రగ్స్ స్కామ్ లో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ పేరు కూడా వెలుగులోకి రాగా ఆమె మాత్రం తనకే పాపం తెలీదని… తాను కనీసం పొగ కూడా తాగనని తెలిపింది.

అయితే తాజాగా సుశాంత్ మృతి కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది.

సుశాంత్ మృతి తరువాత సుశాంత్ లవ్ ఎఫైర్లకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.సుశాంత్, కృతిసనన్ జంటగా రాబ్తా అనే సినిమాలో కలిసి నటించారు.

ఆ సినిమాలో వీరిద్దరూ డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చినా వాళ్లు మాత్రం ఆ విషయాన్ని అంగీకరించలేదు.అయితే తాజాగా నటి లీజా మాలిక్ కృతి, సుశాంత్ మధ్య లవ్ ఉందని… వాళ్లు డేటింగ్ చేశారని చెప్పుకొచ్చింది.

సుశాంత్ మృతి తరువాత కృతి తన గుండెలో ఒక భాగం వెళ్లిపోయిందంటూ చేసిన కామెంట్ కూడా కొత్త చర్చకు దారి తీస్తోంది.కరోనా, లాక్ డౌన్ ఉన్నప్పటికీ సుశాంత్ అంత్యక్రియలకు కృతి హాజరైంది.

సీబీఐ అధికారులు ఈ దిశగా దర్యాప్తు జరిపితే మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

#Suicide Case #SushantSingh #Dating #Kriti Sanon #HeroSushanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kriti Sanon Dated Sushant Singh Rajput Related Telugu News,Photos/Pics,Images..