చెల్లెలిని హీరోయిన్ గా  పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్న మహేష్ హీరోయిన్... 

తెలుగులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన టువంటి “వన్” అనే చిత్రం లో మహేష్ సరసన ఆడిపాడిన ముద్దుగుమ్మ అందరికీ బాగానే గుర్తుంటుంది.ఈ అమ్మడు వచ్చీరావడంతోనే స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకున్నా  తెలుగులో పెద్దగా అవకాశాలు తలుపు మాత్రం తట్టలేదు.

 Bollywood Actress Kriti Sanon Is Trying To Introduce His Sister To Tollywood Fil-TeluguStop.com

ఎట్టకేలకు అక్కినేని నాగచైతన్య హీరోతో ఓ చిత్రంలో నటించినప్పటికీ ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది.దీంతో ఈ అమ్మడు చేసేదేమీలేక మూటా ముల్లె సర్దుకుని ముంబై కి  వెళ్ళిపోయింది.

అయితే అక్కడ మాత్రం వరస అవకాశాలు రాబట్టుకొని బాగానే నిలదొక్కుకుంది.

అయితే ప్రస్తుతం కృతి సనన్ తన చెల్లెలు నుపూర్ సనన్ ను తెలుగు సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తుందట.

అంతేగాక ఇప్పటికే తనతో సన్నిహితంగా ఉన్నటువంటి కొందరు తెలుగు సినీ ప్రముఖులతో ఈ విషయం గురించి పలు మార్లు చర్చిందట.అంతేగాక ఓ దర్శకుడు నుపూర్ సనన్ ని  తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేసేందుకు బాలీవుడ్ లో విజయం సాధించినటువంటి ఓ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరికి నూపుర్ సనన్ తెలుగు తెరపై కనిపించే అవకాశం ఉంది.

Telugu Debute, Kriti Sanon, Nupur Sanan, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్లో తన హవాను కొనసాగిస్తోంది.ఇటీవల కాలంలో ఈ అమ్మడు నటించినటువంటి పానిపట్, హౌస్ ఫుల్ – 4, లుకా చుప్పి, కలంక్, వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.అయితే ప్రస్తుతం కృతి సనన్ “మిమి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు లక్ష్మణ్ ఉట్కేర్ దర్శకత్వం వహిస్తుండగా దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube