రామ్ చరణ్ అక్క ఆ హీరోతో డేటింగ్ చేస్తుందటగా…  

Kriti Kharbanda Ram Charan Bruce Lee Srinu Vaitla Tollywood Pulkith Samrath - Telugu Bruce Lee, Dating News, Kriti Kharbanda, Love News, Pulkith Samrath, Ram Charan, Srinu Vaitla, Tollywood

టాలీవుడ్ లో 2013వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల వహించినటువంటి బ్రూస్ లీ చిత్రంలో రామ్ చరణ్ అక్క పాత్రలో నటించినటువంటి హీరోయిన్ కృతి కర్బందా తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.అయితే ఈ అమ్మడు తెలుగులో రామ్ పోతినేని, మంచు మనోజ్, సుమంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదితర స్టార్ హీరోల చిత్రాల్లో నటించినప్పటికీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

 Kriti Kharbanda Ram Charan Bruce Lee Srinu Vaitla Tollywood Pulkith Samrath

అందువల్ల తెలుగులో ఈ అమ్మడు అవకాశాలు దక్కించుకోలేకపోయింది.అయితే అవకాశాల కోసం బాలీవుడ్ వైపు వెళ్లినా ఇప్పటి వరకు సరైన హిట్ లేక పోవడంతో తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.

అయితే తాజాగా ఈ అమ్మడుకి సంబంధించినటువంటి లవ్ గాసిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అయితే ఇందులో బాలీవుడ్లో మంచి విజయం సాధించినటువంటి సనమ్ రే చిత్రంలో హీరోగా నటించినటువంటి పులకిత్ సామ్రాట్ తో ప్రేమాయణం నడుపుతున్నట్లు పలు కథనాలు వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ అక్క ఆ హీరోతో డేటింగ్ చేస్తుందటగా…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే వీటిపై స్పందించిన కృతి కర్బందా నిజమే అంటూ తేల్చేసింది. అంతేగాక డేటింగ్ ప్రేమ వ్యవహారాలు, పూర్తిగా తన వ్యక్తిగతమని అందులో ఇతరుల జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు.

అంతేగాక తామిద్దరూ ఒప్పుకోవడం వల్లనే ఇలా బహిరంగంగా తమ ప్రేమ వ్యవహారం గురించి తెలియజేస్తున్నామని కూడా తెలిపింది.దీంతో ప్రస్తుతం ఈమె ప్రేమ వ్యవహారంపై వస్తున్నటువంటి వార్తలకు పుల్ స్టాప్ పడినట్లు అయింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించినటువంటి హౌస్ ఫుల్ – 4 అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకుంది.

దీంతో ఈ అమ్మడికి బాలీవుడ్లో మరో రెండు అవకాశాలు దక్కాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Actress Kriti Kharbanda Dating With Pulkith Samrath Related Telugu News,Photos/Pics,Images..